CIBIL స్కోర్ తక్కువుగా ఉన్నా బ్యాంక్ లోన్ పొందవచ్చు? ఎలా అంటే?

www.mannamweb.com


ప్రస్తుతం క్రెడిట్ కార్డులు తీసుకోవడం, లోన్స్ తీసుకోవడం అందరికీ చాలా అవసరంగా మారిపోయింది. మనకు ఎంత సేవింగ్స్ ఉన్నా కానీ ఎంతో కొంత లోన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే బ్యాంకుల ద్వారా లోన్ తీసుకోవడం అంటే కత్తి మీద సాము లాంటిది. అంత చిన్న విషయం కాదు. ఈజీగా బ్యాంక్ లోన్ రాదు. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ఒక్కోసారి మీరు తీసుకునే లోన్ శాంక్షన్ కావాలంటే ఎన్నో నెలలు తరబడి కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. మనకు సంపాదన ఎక్కువున్నా లోన్ కావాలంటే ముందుగా బ్యాంకులు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతుంది. మీ సిబిల్ స్కోర్ ఎంత? అని. ఆ ప్రశ్నకు మీరు చెప్పే సమాధానాన్ని బట్టే మీ లోన్ శాంక్షన్ అయ్యే ప్రాసెస్ ముందు వెళుతుంది. ఇలా సిబిల్ స్కోర్ అనేది లోన్స్ విషయంలో కీలకపాత్ర పోషిస్తుంది. సిబిల్ స్కోర్ ఎక్కువగా మెరుగ్గా ఉంటే లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. తక్కువగా ఉంటే మాత్రం మనకు ఎంత జీతం ఉన్నా కానీ లోన్ వచ్చే అవకాశం ఉండదు. అయితే ఈ సమస్యకు వేరే మార్గం లేదా? సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే ఇక లోన్ అప్లై చేసుకోలేమా? అని బాధ పడేవారికి ఇప్పుడు చెప్పబోయే విషయం గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా కానీ లోన్ పొందే మార్గం ఒకటి ఉంది? ఇక మార్గం ఏంటి దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సిబిల్ స్కోర్ తక్కువున్నా కానీ లోన్ పొందడానికి Co – Signer అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ తో మనం సిబిల్ స్కోర్ తక్కువున్నా కూడా లోన్ పొందవచ్చు. ఎలాగంటే మీ కుటుంబంలో కానీ లేదా మీకు తెలిసిన వారు కానీ లోన్లు తీసుకొని సకాలంలో కట్టిన వారు ఉంటారు. అందువల్ల వాళ్ళ సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటుంది. వాళ్ళ హామీతో మీరు లోన్ పొందవచ్చు. అందుకు వారు మీతో పాటు బ్యాంకుకి వచ్చి మీ లోన్ పేపర్లపై సైన్ చేయాలి. మీ గురించి బ్యాంక్ వాళ్ళకు హామీ ఇస్తూ వారు సైన్ చేస్తే మీకు లోన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.

కానీ మీరు సకాలంలో లోన్ తీర్చకపోతే ఆ ఎఫెక్ట్ మీ కో సైనర్లపై పడుతుంది. అందువల్ల వారికి నష్టం కలుగుతుంది. కాబట్టి మీరు కచ్చితంగా లోన్ సకాలంలో కట్టగలిగితేనే కో సైనర్ సాయంతో లోన్ తీసుకోండి. ఈ విధంగా మీరు మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా కానీ లోన్ పొందవచ్చు. కాబట్టి సిబిల్ స్కోర్ తక్కువ ఉండి లోన్ అవసరం ఉన్న వాళ్ళు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి.