Cinima Tree – Know the details of the tree – “సినిమాచెట్టు”:గోదావరి గట్టుపై 144 ఏళ్లనాటి మహా వృక్షం ఈ చెట్టు వద్ద 108 సినిమాల చిత్రీకరణ..

www.mannamweb.com


కుమారదేవంలో గోదావరి గట్టుపై 144 ఏళ్లనాటి మహా వృక్షం
ఈ చెట్టు వద్ద 108 సినిమాల చిత్రీకరణ
వంశీ దర్శకత్వంలో 18 చిత్రాల షూటింగ్‌

తాళ్ళపూడి: గోదావరి గట్టుపై 144 ఏళ్ల మహావృక్షం సినీ పెద్దలకు మంచి సెంటిమెంట్‌. ఈ చెట్టు వద్ద దాదా పు 108 సినిమాలు చిత్రీకరించారు. కొవ్వూరు మండలం కుమారదేవంలో శింగలూరి తాతబ్బాయి నాటిన మొక్క మహా వృక్షమై ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాలకు బాసటగా నిలిచింది. ఇక్కడ ఒక షాట్‌ చిత్రీకరించినా సినిమా విజయం సాధిస్తుందని నిర్మాతల సెంటిమెంట్‌ అని ప్ర ముఖ హస్యనటుడు లింగాల రామతీర్థ అంటున్నారు. కుమారదేవం చెట్టుకి సినీ పరిశ్రమకు విడదీయరాని బధం ఉందని ఆయన చెబుతారు. సినిమా చెట్టు విశేషాలు ఆయన మాటల్లోనే..

గోదావరి నదీ తీరాన జన్మించడం పూర్వజన్మ సుకృతం. 309 చిత్రాలలో హాస్యసటుడిగా నటించా. ఈ చెట్టు కింద తీసిన ఎన్నో చిత్రాలు విజయవంతమయ్యాయి. ఇదే చెట్టుకింద దర్శకుడు 18 చిత్రాలు చిత్రీకరించారు. 1974లో పాడిపంటలు చిత్రంలో ఇరుసులేని బండి ఈశ్వరుడి బండి పాట చిత్రీకరించారు. ఈస్ట్‌మన్‌ కలర్‌ చిత్రాలు వచ్చిన కొత్త 1975లో అందాలరాముడు ఈ చెట్టు వద్ద నుంచి చిత్రీకరణ ప్రారంభించారు. గోదావరి పాపికొండల సోయగాలను అంంగా చూపించారు. 1980 మేఘసందేశం చిత్రీకరణ దాసరి నారాయణరావు ఇక్కడనుంచి ప్రారంభించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వంశవృక్షం, బొబ్బిలిబ్రహ్మన్న ఇక్కడే చిత్రీకరించారు. త్రిశూలం చిత్రంలో ఆత్రేయ కలం నుంచి జాలువారిన పన్నెండేళ్లకు పుష్కరాలు పదహారేళ్లకు పరువాలు ఆ నాడు చేసేవి స్నానాలు గీతం ఈ చెట్టు వద్ద చితీక్రరించారు. 1983లో రెండు జెళ్ల సీత, సీతారామకళ్యాణం చిత్రాలలో దర్శకుడు జంద్యాల ఈ చెట్టును చూపించారు.సితార చిత్రంలో వెన్నెల్లో గోదారి అందం సఖి కన్నుల్లో పాటను ఇక్కడే వంశీ చిత్రీకరించారు. ఉండమ్మా బొట్టుపెడతా, శిక్ష, చట్టంతో పోరాటం, తొలికూడి కూసింది చి త్రాలు ఇక్కడే తీయగా సీతారామయ్యగారి మనవరాలు చిత్రానికి అవార్డు దక్కింది. 1991 నుంచి ఇవివి సత్యనారాయణ సీతారత్నంగారి అబ్బాయి, ఏవండి ఆవిడ వ చ్చింది ఇలా తీసిన 23 చిత్రాలకు ఈ చెట్టు కాసులు కురిపించింది. శంకరాభరణం, స్వాతిముత్యం చిత్రాలలో కొన్ని పాటలు చిత్రీకరించారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్ళిసందడి, శ్రీరామదాసు చిత్రాలలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. మహేష్‌బాబు మురారి చిత్రం ఇక్కడ తీసిందే. ఉప్పొంగిందిలే గోదావరి చిత్రంలో వేదమంటి నా గోదారి రామచరితకే పూ దారి పాటను ఇక్కడే చిత్రీకరించారు. అల్లు అర్జున్‌ నటించిన గంగోత్రి, బన్నీ చిత్రా లు విజయంతమయ్యాయి. గోదావరి ఉప్పొంగింది, పట్టుకుంటే కోటి, గుండెల్లో గోదారి, ఇటీవలి గోదావరి నవ్వింది కూడా ఈ చెట్టు వద్దే త్రీకరించారు. గోదావరి ఒడ్డున తాళ్ళపూడిలో పుట్టిన ప్రముఖ సినీ నిర్మాతలు దాసరి దానయ్య, జడ్డు పుల్లారావు, భగవాన్‌ ఇక్కడ నుంచే షూటింగ్‌లు ప్రారంభించారు.

1974 లో వచ్చిన పాడిపంటలు
చిత్రంలో ఇరుసులేని బండి ఈశ్వరుని బండి
..పాటనుండి మొదలైన ఈ చెట్టు ప్రస్థానం …సీతా రామయ్య
గారి మనవరాలు లో సమయానికి…,గోదావరి లో ఉప్పొంగేలే
గోదావరి…లాంటి పాటలు …ఇలా ఒకటేమిటి
చెప్పుకుంటూపోతే వందలాది పాటలు… జనాల
గుండెల్లో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి…ఇప్పు
డున్న దర్శకులు విదేశాలపై మోజు పెంచుకుని
ఈ చెట్టు పూర్తిగా వదిలేసారు..మళ్లీ మా వంశీ గారు సినిమా
తియ్యకపోతారా .. ఈ చెట్టు కు పూర్వ వైభవం
తీసుకురాకపోతారా…అని వేయి కళ్ల తో
ఎదురుచూస్తూ…