మనలో చాలా మందికి గుడ్లు అంటే ఇష్టం. చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌లో గుడ్డును ఎక్కువగా తీసుకుంటారు. గుడ్డులో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటంలో ఫిట్‌నెస్ ప్రియులు దీనిని ఎక్కువ తినడానికి ఇష్టపడుతున్నారు. కొంతమంది దీనిని పచ్చిగా తింటారు. మరికొందరు ఆమ్లెట్ వేసుకుని తింటారు. అయితే ఉడికించిన గుడ్లు ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి. బ్యాచిలర్స్ అయితే గుడ్డు మీద రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. బ్యాచిలర్స్ గుడ్డుతోనే ఎక్కువ కూరలు చేసుకుంటూ ఉంటారు. అయితే, కొందరి గుడ్ల జోలికి పోకూడదని నిపుణులు చెబుతున్నారు.
గుడ్లు తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు..
గుడ్డులో అనేక పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, విటమిన్లు, సెలెనియం, ఐరన్ వంటి ఖనిజాలు గుడ్డులో లభిస్తాయి. గుడ్లు తినడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. గుండె ఆరోగ్యానికి మంచిది. చర్మ, జుట్టు సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇలా చెప్పుకుంటే పోతే బోలెడు ప్రయోజనాలు గుడ్డు తినడం వల్ల శరీరానికి అందుతాయి. అయితే, గుడ్డు కొందరికి పడదు. గుడ్డు తినడం వల్ల వారికి అనారోగ్య సమస్యలు వచ్చే ముప్పు ఉంది. గుడ్డు ఎవరు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
కిడ్నీ సమస్యలు..
కిడ్నీ సమస్యలతో బాధపడేవారు గుడ్లు ఎక్కువ తినకపోవడమే మంచిది. గుడ్లలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. మూత్రపిండ వ్యాధులతో బాధపడేవారు ప్రోటీన్లు ఎక్కువ ఉన్న గుడ్లు తినడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక వేళ మీరు తినాలనుకుంటే వైద్యుణ్ని సంప్రదించడం ఉత్తమం.
అలెర్జీ సమస్యలు..
గుడ్లలోని ప్రోటీన్లలో అల్బుమిన్ ఉంటుంది. శ్వాసకోస సమస్యలు, అలర్జీ సమస్యలు ఉన్నవారికి గుడ్డు ఈ అల్బుమిన్ పడదు. దీంతో.. ఇలాంటి వారు గుడ్డు తినడం వల్ల అలర్జీ సమస్యలు ఎదుర్కోనే ముప్పు ఉంది. వీళ్లు గుడ్డు తినడం వల్ల చర్మంపై ర్యాష్‌లు, కడుపు నొప్పి, ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు.
అధిక కొలెస్ట్రాల్..
ఈ రోజుల్లో చాలా మంది అధిక కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నరు. ఇలాంటి వారు ఎక్కువగా గుడ్డు తినకపోవడమే మంచిది. ఎందుకంటే గుడ్డులో కొలెస్ట్రాల్ ఉంటుంది. గుడ్డు తిన్నప్పుడు వీరిలో మరింత కొవ్వు పెరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు గుడ్డు ఎక్కువ తినకపోవడమే మంచిది. లివర్ సమస్యలు ఉన్నవారు కూడా గుడ్డు జోలికి పోకూడదు.
జీర్ణ సమస్యలు..
కొందరు అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు గుడ్ల జోలికి పోకపోవడమే మంచిది అంటున్నారు నిపుణులు. గుడ్లలోని పచ్చసొన వీరికి పడకపోవచ్చు. గుడ్లు ఎక్కువ తినడం వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, వికారం, పుల్లటి తేన్పులు వచ్చే ప్రమాదముంది.
అధిక యూరిక్ యాసిడ్..
ఈ రోజుల్లో చాలా మంది అధిక యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్య ఉన్నవారు గుడ్లను ఎక్కువ తినకపోవడం ఉత్తమం. గుడ్లలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో గుడ్లు తినడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగే ప్రమాదముంది.
అధిక బరువు..
అధిక బరువు ఉన్నవారు కూడా గుడ్లు తినకపోవడమే బెటర్. గుడ్లలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. దీంతో గుడ్లు తినడం వల్ల కేలరీలు బర్న్ అవ్వడానికి టైం పడుతుంది. దీంతో.. మీరు మరింత బరువు పెరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారు గుడ్డు వైట్ తీసుకుంటే మంచిది.
గమనిక..
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు.