12th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ లేదా యూనిట్స్ లో గ్రూప్ – C ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
అర్హులైన వారు తమ దరఖాస్తులను పోస్టు ద్వారా సెప్టెంబర్ 30వ తేది లోపు పంపించాలి.
ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము , పరీక్ష విధానము , అప్లికేషన్ ప్రారంభ తేదీ, అప్లికేషన్ చివరి తేదీ, అప్లై చేసే విధానము వంటి వివిధ రకాల ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకి త్వరగా అప్లై చేయండి.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : IAF విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య : 16 పోస్టులు
అర్హతలు : క్రింది విధంగా ఈ ఉద్యోగాలకు అర్హత ఉండాలి.
10+2 పాస్ అయ్యి ఉండాలి.
ఇంగ్లీష్ లో నిమిషానికి 35 పదాలు కంప్యూటర్ లో టైప్ చేయగలగాలి. లేదా
హిందీలో నిమిషానికి 30 పదాలు కంప్యూటర్లో టైప్ చేయగలగాలి .
కనీస వయస్సు : ఉద్యోగాలకు అప్లై చేయడానికి కనీసం 18 సంవత్సరాలు వయసు ఉండాలి.
గరిష్ట వయస్సు : ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు.
వయస్సులో సడలింపు :
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు వయసులో సడలింపు ఇస్తారు.
ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయస్సులో చదివింపు ఇస్తారు.
PwBD అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.
జీతము : లెవల్ – 2 పే స్కేల్ ఉంటుంది. అనగా 19,900/- నుండి 63,200/-
అప్లికేషన్ ఫీజు : అప్లికేషన్ ఫీజు లేదు.
అప్లికేషన్ పోస్టు ద్వారా పంపించటకు చివరి తేదీ : 30-09-2024
అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారు తమ దరఖాస్తులను అప్లికేషన్ ను పోస్ట్ ద్వారా పంపించాలి.
అప్లై చేసే అభ్యర్థులు అప్లికేషన్ డౌన్లోడ్ చేసి అన్ని వివరాలు సరిగ్గా నింపి , విద్యార్హతల సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీల పైన సెల్ఫ్ అటేస్టేషన్ చేసి, సొంత చిరునామా కల కవర్ పై పది రూపాయల పోస్టల్ స్టాంప్ అంటించి, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా జతపరిచి అప్లికేషన్ పోస్టు ద్వారా పంపించాలి.
ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు పోస్టులను అనుసరించి స్కిల్ టెస్ట్ / ప్రాక్టికల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.