ఇలా ఎవడైనా చేస్తాడా?: అధికారులపై చంద్రబాబు ఫుల్ సీరియస్!

www.mannamweb.com


ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమలకు చేరుకున్నారు. ఈ మేరకు కలెక్టర్, టీటీడీ అధికారులపై సీరియస్ అయ్యారు. సరిగ్గా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పద్దతి ప్రకారం పని చేయడం నేర్చుకోవాలని అధికారులకు క్లాస్ పీకారు. 2వేల మందే పడతారని తెలిసినా 2500 మందిని ఎందుకు పంపించారని మండిపడ్డారు. కొత్త ప్లేస్లో కౌంటర్లు పెట్టినపుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి కదా అని ప్రశ్నించారు.

వాళ్లు ఎవరో పెట్టారని మీరు కూడా అదే ఫార్ములాను పాటించడం ఏంటి ప్రశ్నించారు. టెక్నాలజీ వాడుకుని టికెట్లు ఇవ్వడం తెలియదా అని ఈవోపై ద్వజమెత్తారు. జేఈవో గౌతమిపైనా సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. జేఈవోగా మీరు చేయాల్సిన బాధ్యత గుర్తు లేదా అని ప్రశ్నించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టికెట్లు ఇవ్వాలని తెలియదా? అని అన్నారు.

ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలం అయ్యారని ఈవో, ఎస్పీ, కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయలేదా అంటూ మండిపడ్డారు. ఎన్ని గంటలకు మెసేజ్ వచ్చింది అని జేఈవో గౌతమిని ప్రశ్నించారు. సరిగ్గా మానిటరింగ్ చేయలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంచార్జ్ వీఐతో మానిటరింగ్ చేశామని జేఈవో గౌతమి తెలిపారు. ఫిర్యాదు వచ్చినా ఎందుకు యాక్షన్ తీసుకోలేదని సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.