టీచర్‌గా సీఎం చంద్రబాబు.. స్టూడెంట్‌గా మంత్రి లోకేష్.. ఆ స్కూళ్లో ఆసక్తికర సన్నివేశం

ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువులో సీఎం చంద్రబాబు(CM Chandrababu), మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) ‘మెగా పేరెంట్-టీచర్’ ప్రోగ్రాంలో పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. జడ్పీ పాఠశాలలోని పదో తరగతి, 8వ తరగతి విద్యార్థులకు చెందిన తరగతి గదిని పరిశీలించిన సీఎం చంద్రబాబు వారితో మాట్లాడారు. ఈ క్రమంలో విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి వారిలో స్పూర్తిని నింపేలా కౌన్సెలింగ్ ఇచ్చారు. అలాగే మెరుగ్గా ఫలితాలు సాధించాలని సీఎం విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాసేపు ఉపాధ్యాయుడిగా మారిన సీఎం చంద్రబాబు, సోషల్ సైన్స్ పాఠాన్ని 8వ తరగతి విద్యార్థులకు బోధించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు చెప్పిన పాఠాన్ని ఒక విద్యార్ధిలా శ్రద్ధగా మంత్రి నారా లోకేష్ విన్నారు. ఆ పాఠశాలలోని విద్యార్థులు సైతం ఆసక్తిగా, శ్రద్ధగా పాఠాన్ని విన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.