హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో ‘సీఎం రేవంత్ ఫుట్బాల్`..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు. నిన్నటి వరకు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన ఆయన ఉదయాన్నే వర్సిటీకి చేరుకుని విద్యార్థులతో కలిసి హుషారుగా ఫుట్బాల్ ఆడారు.


ఆటలో ఉండగా షూ పాడైతే వాటిని తీసేసి మరీ పరుగులు తీశారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీఎంఆర్ ఐఈఎస్ ప్రెసిడెంట్ ఫహీం ఖురేషి, హెచ్సీయూ ఎన్ఎస్యూఐ యూనిట్, హెచ్సీయూ విద్యార్థులు కూడా ఆటలో పాలుపంచుకున్నారు. సీఎం సలహాదారు వేంనరేందర్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం, టీశాట్ ఈఈవో వేణుగోపాల్రెడ్డి తదితరులు హాజరయ్యారు.