చేనేతలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్

చేనేతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) గుడ్ న్యూస్ తెలిపింది. ఇవాళ(శుక్రవారం ఆగస్టు1) నుంచే ఉచిత విద్యుత్ అమలుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు ప్రకటించారు. నేతన్నల ఉచిత విద్యుత్‌కు రూ.125 కోట్ల వ్యయాన్ని ఏపీ ప్రభుత్వం ఖర్చు చేయనుంది.

అయితే, 50 వేల మగ్గాలు, 15 వేల మర మగ్గాలు కలిగిన కుటుంబాలకు ఉచిత విద్యుత్ ద్వారా లబ్ధి చేకూరనుంది. చేనేతలకు ఇచ్చిన ఎన్నికల హామీని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు మంత్రి సవిత. జాతీయ చేనేత దినోత్సవానికి వారం ముందుగానే ఉచిత విద్యుత్ పథకం అమలుకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. చేనేతలకు ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చడంపై సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు. కడప జిల్లాలోని జమ్మలమడుగులోఇవాళ(శుక్రవారం) సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా చేనేతల ఉచిత విద్యుత్ అమలుపై సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.