ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు ఇవాళ భారీ షాక్ తగిలింది. తన నియోజకవర్గం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పరిధిలో ఉన్న నక్కపల్లి బాలికల గురుకుల హాస్టల్ లో తనిఖీలకు వెళ్లిన సమయంలో అక్కడే భోజనం చేశారు.
అయితే ఆమె తింటున్న ప్లేటులోనే బొద్దింక ప్రత్యక్షమైంది. దీంతో ఆమె ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం తేరుకుని గురుకుల హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
































