శీతాకాలంలో చాలామంది నీటిని చాలా తక్కువగా తాగుతూ ఉంటారు. దీంతో డిహైడ్రేషన్ సమస్యలు వస్తాయి. కానీ చలికాలంలో కూడా కొబ్బరి నీళ్ళు శరీరానికి హైడ్రేషన్ అందించడానికి ఎంతో హెల్ప్ చేస్తుంది.
దీంతో చర్మం అనేది ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాక చలి కాలంలో వచ్చే చర్మా పగుళ్లు మరియు జలుబు, దగ్గు లాంటి సమస్యలు కూడా నయం అవుతాయి. అలాగే కొబ్బరి నీళ్లతో పలు రకాల ఆరోగ్య సమస్యలు కూడా దూరం అవుతాయి. ఈ కొబ్బరి నీళ్ళు అనేవి జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది. అలాగే అసీడీటీ మరియు కడుపునొప్పి, పొట్ట ఉబ్బరం లాంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది…
ఈ సీజన్ లో వచ్చే రక్తపోటు మరియు గుండెకు సంబంధించిన సమస్యలు కూడా కొబ్బరి నీళ్లను తాగటం వలన కంట్రోల్ లో ఉంటాయి. అయితే ఈ కొబ్బరి నీళ్లలో ఉండే మెగ్నీషియం మరియు ఎంజెమ్ లు శరీరంలో విష పదార్థాలను బయటకు పంపించడంతో పాటు రక్తాన్ని కూడా శుద్ధి చేస్తాయి. ఈ సీజన్ లో చాలామందికి చర్మం పొడిబారడం లాంటి సమస్యలు వస్తాయి. కానీ కొబ్బరి నీళ్ళు అనేవి చర్మాన్ని పుష్కలంగా హైడ్రేడ్ చేసి, ఈ సమస్య నుండి బయటపడడానికి హెల్ప్ చేస్తుంది. ఈ కాలంలో కొబ్బరి నీరు తాగటం వలన రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీనివలన తరచుగా వచ్చే జలుబు మరియు దగ్గు లాంటి సమస్యలు దూరం అవుతాయి.
పోషకాహార నిపుణులు కూడా చలికాలంలో కొబ్బరి నీళ్లు తాగటం వలన ఆరోగ్యం పెరుగు పడుతుంది అని అంటున్నారు. ఈ చలికాలంలో వచ్చే సమస్యలను దూరం చేయటంలో కూడా కొబ్బరి నీళ్ళు చాలా బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఎసిడిటీ తో వచ్చే పొట్ట ఉబ్బరం మరియు కడుపునొప్పి సమస్యలు అన్నీ కూడా దూరం అవుతాయి. ఈ కొబ్బరి నీళ్లలో ఉండే మెగ్నీషియం అనేది రక్తపోటును కంట్రోల్ లో ఉంచుతుంది. దీని వలన గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.