చల్లని వార్త.. అనుకున్న దాని కంటే ముందే వస్తున్న రుతుపవనాలు!

ప్రస్తుతం భానుడు భగ భగలకు బ్రేక్ ఇచ్చాడు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మే 17 వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాతావరణ శాఖ దేశ ప్రజలకు చల్లని కబురు చెప్పింది. అదేంటంటే.. నైరుతి రుతుపవనాలు అనుకున్న దానికంటే ముందుగానే రాబోతున్నాయి. ఈ విషయాన్ని అధికారులు ప్రకటించారు. నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రానికి చోరుకోబోతున్నాయి అంటూ ప్రకటించారు. నిజానికి ఈ రుతుపవనాలు రావాల్సిన దానికంటే ముందుగానే వస్తున్నట్లు తెలిపారు.


నైరుతి రుతుపవనాలు మే 19కి దక్షిణ అండమాన్ సముద్రానికి చేరుకుంటాయని భారత వాతావరణ శాఖ అధికారులు తాజాగా వెల్లడించారు. నిజానికి ఈ నైరుతి రుతుపవనాలు మే 22కి అండమాన్ సముద్రానికి చేరుకుంటాని చెప్పారు. కానీ, ఇప్పుడు రెండ్రోజుల ముందే రానున్నాయి. అలాగే కేరళకు రుతుపవనాలు వస్తుండటంపై కూడా అధదికారిక ప్రకటన చేశారు. కేరళకు జూన్ 1న రుతుపవనాలు రాబోతున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే కేరళ నుంచి దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించేందుకు కాస్త సమయం పడుతుంది.

కేరళ నుంచి రుతుపవనాలు కదిలి జూలై 15 నాటికి దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని తెలిపారు. అలాగే ఈ ఏడాది వర్షాల విషయంలో రైతాంగం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గతంలోనే ప్రకటించారు. ఎందుకంటే ఈ ఏడాది రుతువపనాల వల్ల అధికంగానే వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే ఈ ఏడాది రుతుపవనాల వల్ల జూన్ నెల నుంచి సెప్టెంబర్ నెల వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాతావరణం, ఈ ఏడాది వర్షానికి సంబంధించి మే నెల చివర్లో భారత వాతావరణ శాఖ మరో అధికారిక ప్రకటన చేయనుంది. వాతావరణ శాఖ చేసిన ఈ ప్రకటనతో రైతులు మాత్రమే కాకుండా.. సాధారణ ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఏడాది పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిన విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడు వర్షాలు పడతాయా అని ఎదురుచూస్తున్నారు. అలాంటి తరుణంలో అధికారులు చల్లని కబురు అందించారు.