చల్లటి నీటితో స్నానం చేయడం వలన ఏం జరుగుతుందంటే..

www.mannamweb.com


స్నానం చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. శరీరం శుభ్ర పడటమే కాకుండా.. ఒత్తిడి, చికాకు తగ్గి రిలీఫ్ వస్తుంది. స్నానం చేయడం వల్ల బరువు కూడా తగ్గుతారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

రోగాలు కూడా త్వరగా రాకుండా అడ్డుకుంటుంది.

అయితే స్నానాన్ని వేడి నీళ్లు లేదా చన్నీళ్లతో చేస్తూ ఉంటారు. కొంత మంది వేడి నీటితో చేస్తే.. మరికొంత మంది చల్లటి నీటితో చేస్తూ ఉంటారు. మరి చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

వేడి నీటితో కంటే చల్లటి నీటితో స్నానం చేయడం మేలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చల్ల నీటితో స్నానం చేయడం వల్ల రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. రక్త ప్రసరణ కూడా మెరుగు పడుతుంది. తెల్ల రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది.

చల్లని నీటితో స్నానం చేయడం వల్ల చర్మ ఇన్‌ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. శరీరంపై ఉండే మంట, చికాకు తగ్గుతాయి. ఒత్తిడిని పెంచే హార్మోన్లు తగ్గుతాయి. మానసిక ఆనందంగా ఉంటారు. వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా సహాయ పడతాయని అంటారు.

చల్ల నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారదు. ఫ్రెష్‌గా ఉన్న అనుభూతి వస్తుంది. ఉదయం పూట ఆఫీసులకు వెళ్లేటప్పుడు చన్నీళ్లతో స్నానం చేస్తే చాలా బెటర్. ఎనర్జిటిక్‌గా ఫీలవుతారు. జీవక్రియ కూడా పెరుగుతుంది.