నిన్ను కొట్టను, తిట్టను.. ఒక్కసారి వచ్చి కలువు: లారెన్స్‌

 ‘విక్రమార్కుడు’లో బాలనటుడిగా కనిపించి ప్రేక్షకులను అలరించాడు రవి రాథోడ్‌ (Ravi Rathod). సెట్‌ వర్క్స్‌ చేస్తూ జీవితాన్ని గడుపుతున్న అతడు గతంలో ఓ ఇంటర్వ్యూలో రాఘవ లారెన్స్‌ గురించి మాట్లాడాడు.


దీనిపై తాజాగా లారెన్స్‌ స్పందించారు.

”ఈ వీడియో చూసి నా హృదయం తరుక్కుపోయింది. ‘మాస్‌’ సినిమా షూటింగ్‌లో తనని కలిశాను. అప్పట్లో ఓ స్కూల్‌లో చేర్పించాను. కాకపోతే ఏడాది తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పారు. అతడిని కలిసేందుకు ఎంతో ప్రయత్నించా. ఇన్నేళ్ల తర్వాత అతడిని చూస్తుంటే భావోద్వేగంగా ఉంది. అలా, చెప్పకుండా వెళ్లిపోయినందుకు నేను కోప్పడతానేమోనని భయపడుతున్నట్లు ఇంటర్వ్యూలో చెప్పాడు. నిజం చెప్పాలంటే, నిన్ను కొట్టను, తిట్టను. కేవలం ఒక్కసారి చూడాలని మాత్రం ఉంది. దయచేసి నన్ను వచ్చి కలువు. నీకోసం ఎదురుచూస్తుంటా” అని లారెన్స్‌ పేర్కొన్నారు.

రవి రాథోడ్‌ (Ravi Rathod) బాల నటుడిగా 50కి పైగా చిత్రాల్లో నటించాడు. ‘విక్రమార్కుడు’లో ఓ సరదా సీక్వెన్స్‌లో కనిపించి ప్రేక్షకులను అలరించాడు. అవకాశాల వేటలో తాను అలసిపోయానని.. అందుకే సెట్‌ వర్క్స్‌ చేస్తున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. కొన్నేళ్ల క్రితం తల్లిదండ్రులు మృతి చెందారని.. స్నేహితులతో కలిసి ఉంటున్నానన్నాడు. అనంతరం రాఘవా లారెన్స్‌ గురించి చెబుతూ.. ఆయన తనని దత్తత తీసుకున్నారని.. ఓ స్కూల్‌లో జాయిన్‌ చేయించారన్నాడు. కాకపోతే తాను ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదన్నాడు. సెలవుల సమయంలో హాస్టల్‌ నుంచి పారిపోయానని.. ఆతర్వాత అక్కడికి వెళ్లలేదన్నాడు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.