ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘కమిటీ కుర్రోళ్లు’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ కానుందంటే..

www.mannamweb.com


ఇటీవల ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై ఘన విజయం సాధించిన ‘కమిటీ కుర్రోళ్లు’. మెగా డాటర్ నిహారిక కొణిదెల తన సొంత నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించారు.

ఈ లో ప్రధాన పాత్రలలో నటించిన నటీనటులు అందరూ కొత్తవాళ్లు కావడం విశేషం. యూట్యూబ్ లో చాలా పాపులర్ అయినవారిని తీసుకుని.. మరికొందరు కొత్తవాళ్లను మెయిన్ లీడ్స్ గా తీసుకుని తెరకెక్కించిన ఈ బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది. ఆగస్ట్ 9న చిన్న గా విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు రూ.17 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ‘కమిటీ కుర్రోళ్లు’ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ తో మొత్తం 15 మంది కొత్త నటీనటులు వెండితెరకు పరిచయమయ్యారు. 90’s కిడ్స్ చదువు, ప్రేమలు, ఊళ్లో వారి జీవితం, స్నేహం, రిజర్వేషన్లు, ఊళ్లో జరిగే జాతరలు ఇలా అన్ని అంశాలు కలగలిపి ఈ ఫీల్ గుడ్ మూవీని తెరకెక్కించారు నూతన దర్శకుడు యదు వంశీ.

కథ విషయానికి వస్తే..

గోదావరి జిల్లాలోని ఓ మారుమూల పల్లెటూరు పురుషోత్తంపల్లి. అక్కడ పన్నెండేళ్లకు ఒకసారి జరిగి భరింకాళమ్మ తల్లి జాతరకు ఎంతో ప్రాశస్త్యం ఉంటుంది. అయితే జాతర జరిగిన పదిరోజులకే సర్పంచ్ ఎన్నికలు కూడా జరగాల్సి ఉంటుంది. అయితే సర్పంచ్ బరిలో నిలబడే ఇద్దరి వ్యక్తులకు మధ్య గొడవలు ఉంటాయి. ఈ క్రమంలోనే జాతర పూర్తయ్యే వరకు ఊర్లో ఎన్నికల ప్రచారం జరగకూడదని తీర్పునిస్తారు. కానీ ఆ తర్వాత ఏమైంది అనేది .