మలబద్ధకమా.? మజ్జిగలో ఈ రెండు కలిపి తాగితే.. మటాష్‌ అంతే

www.mannamweb.com


మలబద్ధకం.. ఇది ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారింది. తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, మారిన జీవన విధానం కారణంగా మలబద్ధకంతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది.

దీర్ఘకాలంగా ఈ సమస్యతో బాధపడితే ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో మలబద్ధకం సమస్య క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక సమస్యలకు కూడా దారి తీసే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. అందుకే ఈ సమస్యను అస్సలు లైట్ తీసుకోకూడదని నిపుణులు చెబుతుంటారు.

మలబద్ధకాన్ని ప్రారంభ దశలోనే చెక్‌ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే వైద్యులను సంప్రదించే కంటే ముందే కొన్ని రకాల నేచురల్‌ చిట్కాలతో ఈ సమస్య నుంచి బయటపడొచ్చని తెలిసిందే. సాధారణంగా మలబద్ధకం సమస్య ఉన్న వారిని మజ్జిగ తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే మజ్జిగలో కొన్ని రకాల వస్తువులను కలుపుకోవడం వల్ల మరింత మెరుగైన ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు. మలబద్ధకం సమస్య ఉంటే అది తర్వాత పైల్స్‌కు కారణం అవుతుంది.

మజ్జిగలో జీలకర్రతో పాటుకొత్తిమీర వంటివి వేసుకోని తాగడం వల్ల మరింత మెరుగైన ఫలితం ఉంటుంది. క్రమంతప్పకుండా రోజుకు రెండుసార్లు ఇలా మజ్జిగను తీసుకుంటే మల బద్ధకంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలన్నీ బలదూర్‌ అవ్వాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.

వీటితో పాటు మలబద్ధకం సమస్య నుంచి బయటపడాలంటే తీసుకునే ఆహారంలో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలను భాగం చేసుకోవాలి. దీంతో మలబద్ధకంతో పాటు ఇతర జీర్ణ సంబంధిత సమస్యలన్నీ బలదూర్‌ అవుతాయని అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.