చిన్న అలవాటు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. మారుతున్న కాలంతో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఆహారంతో పాటుగా జీవనశైలిలో మార్పులతో ఎన్నో అనారోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
కాగా, మన వంటింట్లో వినియోగించే పదార్ధాల్లోనే ఎన్నో ఔషధ గుణాలు కలిగినవి ఉన్నాయి. సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన సోంపు గింజల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో కూడా ఒక శక్తివంతమైన ఔషధంగా పరిగణిస్తారు. రోజూ సోంపు నీరు తాగటం ద్వారా ఊహించని ఫలితాలు పొందవచ్చు
చాలామంది భోజనం తర్వాత కాస్తంత సోంపును నోట్లో వేసుకుంటారు. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. సోంపులో ఉండే ఫైబర్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. సోంపు నీళ్లు జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా, శరీరంలోని మెటబాలిజంను పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. సోంపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యర్థాలను, విష పదార్థాలను బయటకు పంపడానికి సహాయ పడతాయి. సోంపులో పొటాషియం అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో సోడియం స్థాయిలను సమతుల్యం చేసి, రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
సోంపు నీళ్లు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచి, డయాబెటిస్ అదుపులో ఉండటానికి దోహదపడుతుందని చెబుతున్నారు. సోంపు నీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఆరోగ్య రమైన, మెరిసే చర్మానికి దోహదం చేస్తాయి. సోంపు నీరు రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడటం ద్వారా గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. సోంపు శ్వాసకోశంలోని శ్లేష్మం, కఫాన్ని తొలగించడంలో సహాయపడతాయి. సోంపులో విటమిన్-ఎ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైటోఈస్ట్రోజెన్‌లు రుతుక్రమంలో వచ్చే నొప్పిని, తిమ్మిరిని తగ్గించడానికి సహాయపడడంతో పాటు మోనోపాజ్ ఆగిన లక్షణాలు వంటి హార్మోన్ల అసమతుల్యతను తగ్గించటానికి దోహదం చేస్తుంది.
































