ఈ పచ్చి ఆకులతో ఫేస్‌ ప్యాక్‌.. పిచ్చెక్కించే అందం మీ సొంతం..! ఇలా వాడారంటే

అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ, చాలా మందికి ముఖంపై మచ్చలు, మొటిమలు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. మరికొందరు ముఖం మీద నల్లటి పిగ్మెంటేషన్ సమస్యతో బాధపడుతున్నారు. దీన్ని వదిలించుకోవడానికి వారు చాలా ఖరీదైన క్రీములను మార్చి మార్చి వాడుతుంటారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో మరింత డిప్రెషన్‌లోకి కూడా వెళ్తుంటారు. ఇలాంటి వారి కోసం ఆయుర్వేదం ఒక అద్భుత మార్గాన్ని సూచించింది. ముఖంపై ఏర్పడిన నల్ల మచ్చలు, బొంగు మచ్చలను తొలగించేందుకు నిపుణులు సూచించిన ప్రభావవంతమైన ఒక సులభమైన ఇంటి నివారణను ఇక్కడ తెలుసుకుందాం…

నల్ల మచ్చలకు పుదీనా ఆకులు అద్భుత మంత్రంగా నిపుణులు చెబుతున్నారు. పుదీనా ఆకులను నీటితో కలిపి పేస్ట్ లా చేసి మచ్చలపై రాయటం వల్ల కొన్ని రోజుల్లో మచ్చలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. పుదీనా ఆకులలో యాంటీ బాక్టీరియల్, చర్మాన్ని రిఫ్రెష్ చేసే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి చాలా ప్రయోజనకరంగా పనిచేస్తాయి. మచ్చలపై త్వరగా ప్రభావాన్ని చూపుతాయి.


పుదీనా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది ఆహారానికి మంచి రుచిని అందిస్తుంది. అంతేకాదు.. శరీరంలోని అనేక రకాల సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఇందులో ప్రోటీన్, మెంథాల్, విటమిన్-ఎ, రాగి, కార్బోహైడ్రేట్లు వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. కానీ మీకు తెలుసా, పుదీనా ఆకులు చర్మానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

తాజా పుదీనా ఆకులను గ్రైండ్ చేసి దానికి కొంచెం నీరు కలిపి పేస్ట్ తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ పేస్ట్‌ను మీ ముఖానికి అప్లై చేయండి. పుదీనా పేస్ట్‌ను ముఖంపై చక్కటి ప్యాక్‌లాగా అప్లై చేసుకోవాలి. 10 నుండి 15 నిమిషాలు అలాగే ఉంచి ఆపై గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడగాలి.

మీరు ఈ పేస్ట్‌ను వారానికి 2-3 సార్లు ఉపయోగిస్తే అది మీ మచ్చలను తేలికపరుస్తుంది. క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే మీరు మీ ముఖంలో మంచి మెరుపుని చూస్తారు. పుదీనా చర్మానికి చల్లదనాన్ని అందించడమే కాకుండా, అకాల వృద్ధాప్యాన్ని నిరోధించే లక్షణాలను కలిగి ఉంటుంది. మాలిక్యులర్ డైవర్సిటీ పర్సుయేషన్ ఇంటర్నేషనల్ 2022 పరిశోధన ప్రకారం, UV-B కిరణాల వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించడానికి పుదీనా పనిచేస్తుంది.

చర్మం తర్వగా ముడతలు పడకుండా, వృద్ధాప్య ఛాయలు త్వరగా కనిపించకుండా పుదీనా నివారిస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా మృదువుగా చేయడమే కాకుండా కేశ సంరక్షణకు బాగా దోహదపడుతుంది. పుదీనా నూనెను తలకి రాసుకుంటే చుండ్రు సమస్య తగ్గి, వెంట్రుకలు బలంగా అవుతాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.