మరో మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా తెలుగులో. ఆసక్తికరమైన కథా కథనాలతో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఈ ఏడాది మే24న విడుదలైంది.
చిన్న గా విడుదలై మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 30 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడీ ఓటీటీలోకి వచ్చేసింది. అదే రణం హీరో విలన్ బిజూ మేనన్, ఆసీఫ్ అలీ హీరోలుగా నటించిన తలవాన్ . ఓ పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా దర్శకుడు జిస్ జాయ్ ఈ మూవీని తెరకెక్కించాడు. మియా జార్జ్, అనుశ్రీ హీరోయిన్లుగా నటించారు. రూ. 10 కోట్ల బడ్జెట్ తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ గా రూ. 30 కోట్లకు పైగానే వసూళ్లు సాధించం విశేషం. థియేటర్లలో మలయాళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న తలవాన్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10న తలవాన్ ను ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ఇది వరకే ప్రకటించింది. అయితే ఓ రోజు ముందుగానే అంటే సెప్టెంబర్ 9 నుంచే తలవాన్‌ను సోనీలివ్‌లోకి వచ్చేసింది. సోమవారం సాయంత్రం ఆరు గంటల నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చేసింది. మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
తలవాన్ లో బిజు మీనన్, ఆసిఫ్ అలీ పోలీస్ ఆఫీసర్లుగా నటించారు. వీరి యాక్టింగ్‌తో పాటు కథలోని ట్విస్ట్ మలయాళ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల మధ్య ఉన్న గొడవలు, వారి ఈగో చుట్టూ ఈ తిరుగుతుంది. ఎస్ఐ కార్తిక్ వాసుదేవన్ (ఆసిఫ్ అలీ) ట్రాన్స్‌ఫర్‌పై సీఐ జయశంకర్ (బిజు మీనన్) పనిచేస్తోన్న పోలీస్ స్టేషన్‌కు వస్తాడు. అయితే కార్తిక్ దుండుడుకు తనం మనస్తత్వం జయశంకర్‌కు అసలు నచ్చదు. ఈ సమయంలో ఓ కేసులో అరెస్ట్ అయిన మనుదాస్ అనే స్నేహితుడిని జయశంకర్ అనుమతి లేకుండా కార్తిక్ రిలీజ్ చేస్తాడు. దీంతో ఇద్దరికీ గొడవలు మొదలవుతాయి. అదే సమయంలో జయశంకర్ ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తలవాన్ చూడాల్సిందే.