ప్రస్తుతం మీడియా, సోషల్ మీడియాలో .. అటు నటీ నటులు మొదలు నెటిజన్ల వరకు.. అందరూ కొండా సురేఖ పై మండిపడుతున్నారు. సురేఖ చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ వర్గాలు భగ్గుమంటున్నాయి. రాజకీయ లబ్ది కోసం ఎలాంటి సంబంధం లేని వాళ్ళ గురించి ప్రస్తావించారు. అక్కినేని నాగ చైతన్య- సమంత ల డైవర్స్ గురించి చాలా అసభ్యకరంగా వ్యాఖ్యానించారు. వారి పర్సనల్ విషయాలను రాజకీయాలలోకి లాగడంతో.. వెంటనే అక్కినేని కుటుంబం అంతా ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ ట్వీట్ చేశారు. రాజకీయంలో వారికి వారికి మధ్యన ఏదైనా ఉండొచ్చు. కానీ అసలు ఏ మాత్రం సంబంధం లేని సినీ ఇండస్ట్రీ వారిని టార్గెట్ చేయడం సరైనది కాదు. ఈ క్రమంలో ఇప్పుడు నాగార్జున మంత్రి సురేఖపై పరువు నష్టం దావా వేశారు.
అక్కినేని కుటుంబం వరుస ట్వీట్స్ తర్వాత.. ఇండస్ట్రీలో బిగ్ స్టార్స్ కూడా వారికి మద్దతుగా నిలిచారు. బాధ్యత గల పదవిలో ఉన్న మంత్రి కొండా సురేఖ ఇండస్ట్రీ వారి వ్యక్తిగత విషయాలను మాట్లాడడం తప్పని.. ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరు స్పందించారు. దీనితో కొండా సురేఖ సమంతకు క్షమాపణలు చెప్తూ ఓ పోస్ట్ చేశారు. కానీ అక్కినేని కుటుంబం మాత్రం ఆ విషయాన్నీ అక్కడితో వదిలిపెట్టలేదు. ఇప్పటికే అవ్వాల్సిన డ్యామేజ్ అయింది. కాబట్టి , నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. తన ఫ్యామిలీ పరువుకు భంగం కలిగించారంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె కేవలం సమంతకు మాత్రమే క్షమాపణ తెలిపారే కానీ.. ఎక్కడ కూడా అక్కినేని కుటుంబం గురించి ప్రస్తావించలేదు. ఇక నాగార్జున మాత్రమే కాకుండా మిగిలిన స్టార్స్ కూడా కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొండా సురేఖ వ్యాఖ్యలు టోటల్ ఇండస్ట్రీనే టార్గెట్ చేసినట్లుగా ఉన్నాయి. వారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.
అయితే రామ్ గోపాల్ వర్మ ఈ విషయం గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే. కొండా సురేఖ సమంతను తిట్టలేదు పొగిడింది అంటూ చెప్పుకొచ్చారు రామ్ గోపాల్ వర్మ. ఆ ఆడియో రిలీజ్ అయినా కొద్దీ గంటల్లోనే నాగార్జున కేసు ఫైల్ చేశారు. దీనితో ఇండస్ట్రీ వర్గాల నుంచి ఏమైనా ఒత్తిడి ఉందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. మరి మిగిలిన నటీ నటులు ఈ విషయంపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి. కానీ కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలను మాత్రం ఇండస్ట్రీ వర్గాలు అసలు వదిలేలా కనిపించడం లేదు. దీనితో తర్వాత ఏమౌతుందా అని అందరు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరి ఇప్పటికైనా కొండా సురేఖ ఈ విషయంలో స్పందిస్తారో లేదో చూడాలి. ఏదేమైన ఇది చిన్న విషయం అయితే కాదు. ఇండస్ట్రీ వర్గాలు దీనిపై ఎదో ఒక కఠిన నిర్ణయమే తీసుకునేలా ఉన్నారు. ఇక ఈ విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.