Currency Notes: కొత్త రూ. 350, రూ. 5కోట్లు చూశారా…ఆర్బీఐ ఏం చెబుతుందంటే?

ఆర్బిఐ(RBI) కొత్త రూ. 350, రూ. 5 కరెన్సీ నోట్లను విడుదల చేస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. వార్తలే కాదు ఆ నోట్లకు సంబంధించిన ఫొటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉంది? ఆర్బిఐ ఏం చెబుతుందో తెలుసుకుందాం.


బ్లాక్ మనీ (Black money)ని అరికట్టేందుకు పెద్దనోట్ల రద్దే మార్గమని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) భావించింది. అందుకే 2016లో పాత రూ. 500, రూ. 1000 కరెన్సీ నోట్లను రద్దు చేసింది. అప్పట్లో ఈ వార్త పెద్ద సంచలనం క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఆర్బిఐ కొత్తగా రూ. 500, రూ. 2000 కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టింది. పెద్ద నోట్ల వల్ల బ్లాక్ మనీ పెరుగుతుందని భావించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Reserve Bank of India) రూ. 1000 కరెన్సీ నోటు కంటే పెద్ది అయిన రూ. 2000 నోటును తీసుకురావడం వెనక ఆంతర్యం జనానికి అస్సలు అర్థం కాలేదు. అయితే ఆ తర్వాత కూడా కొత్త రూ. 200 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) విడుదల చేసింది. ఇలా నోట్లు మార్పుల వల్ల నల్లధనం అరికట్టడం సంగతి ఎలా ఉన్నా దొంగ నోట్ల ముద్రణ, చలామణి తగ్గుతాయని ఆర్బిఐ చెబుతోంది.

2023లో మరోసారి ఆర్బిఐ నోట్ల రద్దు దిశగా అడుగులు వేసింది. చలామణిలో ఉన్న అతిపెద్ద కరెన్సీ నోటు అయిన రూ. 2000నోటును వెనక్కి తీసుకోవడం ప్రారంభించింది. 2016లో చేసినట్లుగా ఒక్కసారిగా రద్దు చేయకుండా రూ. 2000నోటును వెనక్కు తీసుకోవడం ప్రారంభించింది. చలామణిలో ఉంచుతూనే బ్యాంకులకు వచ్చిన వాటిని అక్కడే ఆపేసేలా ఆదేశాలు ఇచ్చింది. ఇలా 2024 చివరికి దాదాపుగా 2000నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India) దగ్గరకు వచ్చేశాయి.

రూ. 2000నోటు ఉపసంహరణతో ప్రస్తుతం రూ. 500నోటు దేశంలోనే అతిపెద్ద డినామినేషన్స్ కరెన్సీ (Denominations Currency)నోటుగా మారింది. అయితే టీవీలు, న్యూస్ పేపర్ల కంటే విస్త్రుతంగా సోషల్ మీడియా అందుబాటులో ఉండటంతో ఎక్కడ ఏం జరిగినా వెంటనే ఆ విషయాలు నిమిషాల్లో దేశవ్యాప్తంగా వైరల్ అయిపోతున్నాయి. అలా ఇటీవల రూ. 350, రూ. 5 కరెన్సీ నోట్ల ఫొటోలని చెబుతూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు రూ. 350, రూ. 5కరెన్సీ నోట్లను ఆర్బీఐ జారీ చేసినట్లు వార్త ప్రచారం అవుతోంది.

అయితే ఇవి కొత్త ఫోటోలు కావని.. మూడేళ్ల క్రితం ఇలాగే ఈ ఫోటోలు వైరల్ అయ్యాయని తెలిసింది. ఇప్పుడు కూడా కొందరు కావాలని ఈ ఫొటోలను మళ్లీ తెరపైకి తీసుకువచ్చారు. ఇవన్నీ నకిలీ ఫొటోలే. దేశంలో కొత్త డినామినేషన్ నోట్లను విడుదల చేయలేదని ఆర్బిఐ తెలిపింది. ప్రస్తుతం ఉన్న డినామినేషన్లు రూ. 5, రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200, రూ. 500. ఇవి కాకుండా రూ. 2, రూ. 5 నోట్లు కూడా ఉన్నాయి. అయితే వాటి ముద్రణను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిలిపివేసింది. అయినప్పటికీ మార్కెట్లో ఉన్నవి చట్టబద్ధంగా ఉపయోగించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది.

ఏదైనా కొత్త కరెన్సీ లేదా కాయిన్ విడుదల చేసే హక్కు ఒక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(Reserve Bank of India)కు ఉంటుంది. ఇలాంటివి ఏవైనా విడుదల చేసినప్పుడు కచ్చితంగా ప్రకటిస్తాం. ఆర్బిఐ ప్రకటన కాకుండా ఎవరు ఇలాంటివి చెప్పినా నమ్మకూడదు.