మొంథా తుఫాను ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రేపు తుఫాను మచిలీపట్నం – కళింగపట్నం మధ్య తీరం దాటనుంది. ఇప్పటికే ఉత్తరాంధ్రతోపాటు పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి.
అయితే తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. విజయవాడ డివిజన్ మీదుగా ప్రయాణించాల్సిన 54 రైళ్లను రద్దు చేసింది. విజయవాడ, గుంటూరు, నర్సాపురం, కాకినాడ, విశాఖ, ఒంగోలు నుంచి మంగళవారం, బుధవారం బయలుదేరే ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. వాటి గురించి ప్రయాణికుల మొబైల్స్‌కి సందేశాలు పంపింది.

































