బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. అతి తక్కువ ధరకే డైలీ 3GB డేటా.. 84రోజుల వ్యాలిడిటీ.

బీఎస్ఎన్ఎల్ మరో అదిరే రీచార్జ్ ప్లాన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యింది. 84 రోజుల చెల్లుబాటుతో అత్యంత చౌకైన ప్లాన్‌ను తీసుకువచ్చింది! ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 3GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం

గత కొంత కాలంగా బీఎస్ఎన్ఎల్ మంచి మంచి ఆఫర్లతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పటికే చాలా మంది బీఎస్ఎన్ఎల్ వైపు మళ్లారు. ఎయిర్ టెల్, జియో కంపెనీలు ఏడాది క్రితం రీఛార్జ్ ధరలు పెంచడంతో చాలా మంది బీఎస్ఎన్ఎల్‌కు పోర్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ ప్రభుత్వ సంస్థ ఓ అద్భుతమైన ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో డేటా, కాలింగ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


84 రోజులు.. 3జీబీ డేటా..

బీఎస్ఎన్ఎల్ తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ కొత్త ప్లాన్ గురించి వెల్లడించింది. ఈ ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంది. అన్‌లిమిటెడ్ కాల్స్, ప్రతి రోజూ 3జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. దీంతో పాటు ఈ ప్లాన్‌లో రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. అయితే ఈ ప్లాన్ ధర కేవలం రూ.599 మాత్రమేనని బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. ఇంత తక్కువ ధరతో ఇతర ఏ నెట్‌వర్క్ ఇటువంటి ప్లాన్ అందించడం లేదు.

రూ.1కే సిమ్.. డేటా, కాలింగ్

ఈ అద్భుతమైన ప్లాన్‌తో పాటు బీఎస్ఎన్ఎల్ మరో బంపర్ ఆఫర్‌ను కూడా కొనసాగిస్తోంది. కొంతకాలం క్రితం కంపెనీ ప్రకటించిన ఫ్రీడమ్ ఆఫర్ కింద వినియోగదారులు కేవలం రూ.1కే బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డును పొందవచ్చు. సిమ్ కార్డ్ మాత్రమే కాదు, ఈ ఆఫర్‌తో 30 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2జీబీ డేటా, ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ కాల్స్ సౌకర్యం కూడా లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ ఆగస్టు 31 వరకు మాత్రమే చెల్లుతుంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు బీఎస్ఎన్ఎల్ ఇలాంటి ఆకర్షణీయమైన ప్లాన్‌లతో ముందుకు వస్తోంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.