కళ్ల కింద డార్క్ సర్కిల్స్‌.. పైసా ఖర్చులేకుండా పోగొట్టే అద్భుత చిట్కా

కళ్ల కింద, కంటి చుట్టు పక్కల నల్లని మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? ఈ డార్క్ సర్కిల్స్ మీ గ్లామర్‌ను దెబ్బతీస్తున్నాయని ఫీలవుతున్నారా?


అయితే పెద్దగా ఖర్చు అవసరం లేని ఓ చక్కటి పరిష్కారం ఉందంటున్నారు ఆయుర్వేదిక్ నిపుణులు. ఇంతకీ అదేంటంటే.. కాచి చల్లార్చి ఫ్రిజ్‌లో పెట్టిన చల్లటి పాలను డార్క్ సర్కిల్స్‌పై అప్లయ్ చేయడమే. దీనివల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఎందుకు ఏర్పడతాయి?

సాధారణంగా రోజువారీ జీవితంలో ఒత్తిడి, నిద్రలేమి, డ్రై స్కిన్ లేదా జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడుతుంటాయి. వీటివల్ల ప్రమాదం లేకపోయినా చూడ్డానికి బాగోదని వాటిని పోగొట్టే ప్రయత్నం చేస్తుంటారు చాలామంది. అందుకోసం మార్కెట్లో లభించే రకరకాల క్రీములు సైతం వాడుతుంటారు. అయితే వీటికంటే బెటర్ కోల్డ్ మిల్క్ (cold milk) అప్లయ్ చేయడం నల్లమచ్చలను పోగొట్టడంలో అద్భుతంగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

కోల్డ్ మిల్క్‌తో ఇలా..

చల్లని పాలను డార్క్ సర్కిల్స్‌పై అప్లయ్ చేయడంవల్ల ఆ పాలలోని లాక్టిక్ యాసిడ్ (Mild exfoliator) డార్క్ సర్కిల్స్‌లోని మృతకణాలను తొలగించి, స్కిన్ టోన్‌ను బ్రైట్ చేస్తుంది. అదనంగా పాలలోని ప్రోటీన్స్, విటమిన్స్ (A, D), మినరల్స్ కంటి కింది భాగాన్ని హైడ్రేట్ చేసి, మాయిశ్చరైజ్ చేస్తాయి. పైగా చల్లని టెంపరేచర్ వల్ల బ్లడ్ సెల్స్ కుదించబడి వాపును తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. ఫలితంగా ఫైన్ లైన్స్ స్మూత్ అవుతాయి. స్కిన్ టైట్ అవుతుంది. డెర్మటాలజిస్టులు కూడా చెప్పేది ఏమిటంటే.. లాక్టిక్ యాసిడ్ సహజ బ్లీచింగ్ ఏజెంట్‌(Natural bleaching agent)గా పనిచేసి మెలనిన్ ప్రొడక్షన్‌ను తగ్గిస్తుంది. కోల్డ్ మిల్క్‌లోని విటమిన్‌లు దీనిని నివారించడంలో సహాయపడతాయి. అయితే సెన్సిటివ్ స్కిన్ ఉంటే గనుక అలర్జీ రాకుండా ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయాలని సూచిస్తున్నారు.

ఎలా అప్లయ్ చేయాలంటే.. ?

రాత్రి పూట నిద్రపోయేముందు ఫ్రిజ్‌లో చల్లబరచిన ఫుల్-ఫ్యాట్ మిల్క్ (ఆవుపాలు బెస్ట్) తీసుకోండి. కాటన్ ప్యాడ్ లేదా బాల్‌ను పాలలో ముంచి, కంటి కింది భాగంలో 10-15 నిమిషాలు జెంటిల్‌గా పెట్టండి. కాసేపు రిలాక్స్ అయి, తర్వాత చల్లని నీటితో కడిగేయండి. రోజూ ఇలా రిపీట్ చేస్తూ వన్ వీక్‌లో డార్క్ సర్కిల్స్ పోయి, స్కిన్ గ్లో అవుతుంది. దీంతోపాటు బెస్ట్ రిజల్ట్స్ కోసం రోజుకు 7-8 గంటల నిద్ర, హైడ్రేషన్‌గా ఉండేందుకు సరిపడా నీళ్లు తాగడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.