పాన్ కార్డ్ (శాశ్వత ఖాతా సంఖ్య) మన ఆర్థిక గుర్తింపులో కీలకమైన భాగం. పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడం నుండి బ్యాంకు ఖాతాలను తెరవడం, ప్రధాన ఆర్థిక లావాదేవీల వరకు ప్రతిదానికీ ఇది అవసరం.
కానీ పన్నులు దాఖలు చేసే సమయంలో లేదా బ్యాంకు ఖాతాను తెరిచే సమయంలో మీరు ఆధార్‌తో లింక్ చేయనందున మీ పాన్ కార్డ్ డీయాక్టివేట్ అవుతుందని గుర్తించుకోండి.
పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం ఎందుకు ముఖ్యం?
మీరు ఇంకా మీ పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయకపోతే, త్వరగా చేసుకోండి. ఆదాయపు పన్ను శాఖ దీనికి డిసెంబర్ 31, 2025 గడువును నిర్ణయించింది. ఈ తేదీ తర్వాత మీ పాన్ కార్డ్ జనవరి 1, 2026 నుండి డియాక్టివేట్ అవుతుంది. ఒక చిన్న నిర్లక్ష్యం మీ ప్రధాన ఆర్థిక ప్రణాళికలకు ఆటంకం కలిగించవచ్చు. అందుకే ఈ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయండి.
పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసే ప్రక్రియ:
- ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లండి: https://www.incometax.gov.in/iec/foportal/
- హోమ్‌పేజీ దిగువన ఎడమవైపున ఉన్న “లింక్ ఆధార్” ఎంపికపై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ 10 అంకెల పాన్ నంబర్, 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
- స్క్రీన్ పై సూచనలను అనుసరించి రూ.1,000 చెల్లింపును పూర్తి చేయండి.
- అన్ని వివరాలను సమర్పించండి.
- పోర్టల్ మీ అభ్యర్థనను అంగీకరిస్తుంది. లింకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
ఆధార్ పాన్‌తో లింక్ అయిందో లేదో ఎలా తనిఖీ చేయాలి?
- https://www.incometax.gov.in/iec పోర్టల్‌కి వెళ్లి “లింక్ ఆధార్ స్టేటస్” ఆప్షన్‌ను ఎంచుకోండి.
- ఇప్పుడు మీ పాన్, ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి.
- మీ పాన్ ఆధార్‌తో లింక్ చేయబడిందో లేదో మీరు స్క్రీన్‌పై చూస్తారు.
మీరు ఇంకా ఈ ముఖ్యమైన పని చేయకపోతే ఆలస్యం చేయకండి. మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. కానీ అలా చేయడంలో విఫలమైతే మీ పన్ను, బ్యాంకింగ్, పెట్టుబడికి సంబంధించిన అన్ని పనులకు అంతరాయం కలుగుతుంది.
































