అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచాక.. ఆయన సన్నిహితుడు ఎలన్ మస్క్ నూతనోత్సాహంతో కనిపిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వంలో కీలక పదవిని ఆయనకోసం కేటాయించారు.
రాజకీయాల్లో క్రీయాశీలకంగా ఉంటూనే, మస్క్ ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశారు. అంతర్జాతీయ ప్రయాణ రంగంలో ఒక విప్లవాత్మక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది. అదే స్టార్ షిప్ రాకెట్. దీని సాయంతో ప్రయాణికులు.. ప్రపంచంలోని ఏ దేశానికైనా 30 నుంచి 40 నిమిషాల్లోపు చేరుకోవచ్చు. ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఫ్యూచర్‌లో ట్రావెలింగ్ ఎలా ఉంటుందో చూద్దాం.
అమెరికా టు ఇండియా 30 నిమిషాలే జర్నీ
లాస్‌ఏంజెల్స్ టు టొరంటో – 24 మినిట్స్
ఢిల్లీ టు శాన్‌ఫ్రాన్సిస్కో – 30 నిమిషాలు
న్యూయార్క్ టు షాంఘై, హాంకాంగ్ – 39 మినిట్స్
ఇది ఎర్త్ టు ఎర్త్ స్టార్‌షిప్ రాకెట్. దాదాపు 395 అడుగుల పొడవు ఉంటుంది. స్టార్‌షిప్ రాకెట్‌లో వెయ్యిమంది ప్రయాణించవచ్చు. భూ కక్ష్య దాకా వెళ్లి, తర్వాత గమ్యస్థానం చేరుతుంది. దీంతో నిమిషాల్లో ప్రయాణం పూర్తవుతుంది. సాధారణంగా ఢిల్లీ నుంచి అమెరికాలోని న్యూయార్క్ నగరానికి విమానం ద్వారా చేరుకోవాలంటే కనీసం 16 గంటల సమయం పడుతుంది. కానీ ఇప్పుడు ఎలన్ మస్క్ కంపెనీ స్పేస్ ఎక్స్ రాకెట్ టెక్నాలజీతో ఈ ప్రయాణ వ్యవధి 30 నిమిషాలకు తగ్గిపోతుంది. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఇది సాధ్యమే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై పనులు జరుగుతున్నాయి. మరి కొన్నేళ్లలో ఇది ప్రజలకు అందుబాటులోకి రానుందని చెబుతున్నారు. భవిష్యత్తులో అదే గనుక జరిగితే…అన్ని ఎయిర్‌లైన్స్ మూతపడే అవకాశం ఉంది లేదా గట్టి పోటీని ఎదుర్కొనే అవకాశం ఉంది.