డీఎస్పీ నుంచి కానిస్టేబుల్‌గా డిమోట్.. ఎందుకంటే..

ఉత్తర్‌ ప్రదేశ్‌ పోలీస్‌ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. బుద్ధి వంకరగా ఉండి ఓ అధికారి చేసిన తప్పుకు తగిన శిక్షను విధించింది. డీఎస్పీ స్థాయి నుంచి అతన్ని కానిస్టేబుల్‌ వరకు డిమోట్‌ చేసింది.


ప్రస్తుతం ఈ వార్త ఉత్తర్‌ ప్రదేశ్‌లో మాత్రమే కాదు.. సోషల్‌ మీడియా మొత్తం చర్చనీయాంశంగా మారింది.

క్రిపా శంకర్‌ కనౌజియా అనే వ్యక్తి పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. కానిస్టేబుల్ స్థాయి నుంచి అంచలంచెలుగా ఎదిగి..డీఎస్పీ స్థాయి వరకు చేరుకున్నాడు. ఉద్యోగం పెద్దది.. అధికారాలు ఎక్కువే అయినా.. అతని బుద్ధి మాత్రం మందగించింది. మూడేళ్ల క్రితం ఒక మహిళతో వివాహేతరం సంబంధం పెట్టకున్నాడు. ఈ విషయంలో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబట్టాడు. అయితే.. ఈ ఘటన జరిగిన సమయంలో అతను ఉన్నావ్‌లో సర్కిల్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ కారణాలు అని చెప్పి ఎస్పీ అనుమతితో సెలవు తీసుకున్నాడు క్రిపా శంకర్. ఆ తర్వాత అతనుఇంటికి వెళ్ల కుండా ఒక మహిళా కానిస్టేబుల్‌తో కలిసి కాన్పూర్‌లోని హెటల్‌ కువెళ్లాడు. అధికారిక, వ్యక్తిగత ఫోన్లను అన్నింటినీ స్విచ్చాఫ్ చేశాడు.

క్రిపా శంకర్‌ ఫోన్‌కు అతని భార్య కాల్‌ చేసింది.. స్విచ్ఛాఫ్‌ వచ్చింది. ఎన్ని సార్లు ప్రయత్నించినా ఇదే రిపీట్ కావడంతో ఆమె ఎస్పీని సంప్రదించారు. ఇక ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే లొకేషన్‌ను ట్రేస్ చేసేందుకు.. ఎక్కడ ఫోన్ ఆఫ్ అయిందనేది గుర్తించారు. ఆ తర్వాత హోటల్‌కు వెళ్లి ఇద్దరినీ పట్టుకున్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించారు ఉన్నత పోలీసు అధికారులు. క్రమశిక్షణారాహిత్యం కింద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేవించారు. దాంతో.. ఇటీవల దీనిపై విచారణ పూర్తి చేసిన పోలీసులు .. క్రిపా శంకర్‌ను గోరఖ్‌పూర్‌ బెటాలియన్‌లోని ‘ప్రావిన్షియల్‌ ఆర్మ్‌డ్‌ కానిస్టేబులరీ’లో కానిస్టేబుల్‌గా డిమోట్‌ చేశారు. యూపీ పోలీసులు తీసుకున్న చర్యలను అందరూ అభినందిస్తున్నారు. కొందరైతే డిమోట్ కాదు.. పూర్తిగా డిస్మిస్ చేయాల్సిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.