ప్రస్తుతం దేశంలోని 14 రాష్ట్రాల్లో 23 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పదవిపై చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవి వరిస్తుందని అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ రాజ్యంగంలో ఈ పదవి ఉందా.. డిప్యూటీ సీఎం పదవిపై గతంలో సుప్రీం కోర్టు ఏం చెప్పిందో చూద్దాం.
రాజ్యాంగంలోని 163, 164 అధికరణలు ముఖ్యమంత్రి, మంత్రివర్గానికి సంబంధించిన నిబంధనలను తెలియజేస్తాయి. ఆర్టికల్ 163(1) ప్రకారం గవర్నర్‌కు సలహా ఇచ్చేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రివర్గం ఉంటుంది. ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారని, మంత్రివర్గాన్ని కూడా ముఖ్యమంత్రి సలహా మేరకే గవర్నర్ నియమిస్తారనే నిబంధన ఉంది. అయితే ఈ రెండు పేరాల్లో డిప్యూటీ సీఎం పదవి ప్రస్తావన లేదు. రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రితో సమానంగా డిప్యూటీ సీఎం పదవిని పరిగణిస్తారు. క్యాబినెట్ మంత్రికి లభించే జీతం, సౌకర్యాలే డిప్యూటీ సీఎంకు కూడా లభిస్తాయి.
డిప్యూటీ సీఎం నియామకంపై ఈ ఏడాది ఫిబ్రవరి 12న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగ విరుద్ధం కాదని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. నిజానికి డిప్యూటీ సీఎంల నియామకాలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను ప్రజా రాజకీయ పార్టీ అనే సంస్థ దాఖలు చేసింది. రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం లాంటి పదవి లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు)ని ఉల్లంఘిస్తుందని
ఈ పిటిషన్‌ను తోసిపుచ్చిన చీఫ్ జస్టిస్ చంద్రచూడ్.. డిప్యూటీ సీఎం పదవి అనేది ఒక పదవి అని, అది రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించదని అన్నారు. డిప్యూటీ సీఎం కావడం వల్ల ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు లేదా అధిక జీతం లభించదని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి మొదటి, అత్యంత ముఖ్యమైన మంత్రి అని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. డిప్యూటీ సీఎం పదవి రాజ్యాంగ ఉల్లంఘన కాదని స్ఫష్టం చేసింది