BREAKING: అపోలో ఆస్పత్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. దీనికోసం ఆయన ఈరోజు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చేరారు.


అక్కడి వైద్యులు ఆయనకు స్కానింగ్, సంబంధిత పరీక్షలు నిర్వహించారు. నివేదికలను పరిశీలించిన వైద్యులు అనేక సూచనలు చేశారు. నేడు చేసిన వైద్య పరీక్షలతో పాటు మరికొన్ని వైద్య పరీక్షలు అవసరమని వైద్యులు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా లేదా మార్చి మొదటి వారంలోగా మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకుంటానని ఆయన అనుచరులు చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారని.. ప్రభుత్వానికి సంబంధించిన ఏ విషయాలను ఆయన మిస్ చేసుకోరని ఆయన అన్నారు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. వైరల్ జ్వరంతో బాధపడ్డారు. దానితో పాటు స్పాండిలైటిస్ సమస్య కూడా ఆయనను వేధిస్తోంది. అయినప్పటికీ, పవన్ కళ్యాణ్ తన పనిని నిర్లక్ష్యం చేయడం లేదు. తన ఆరోగ్య సమస్యల కారణంగా దేవాలయాలను కూడా సందర్శించారు.