హ్యుందాయ్ వెన్యూ కొత్త మోడల్ వచ్చేస్తోంది! డిజైన్, ఫీచర్లు సూపర్!

కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్.. త్వరలోనే నెక్స్ట్ జనరేషన్ ‘వెన్యూ’ను ఇండియా లాంచ్ చేయనుంది. ఎస్‌యూవీ కేటగిరీలో హ్యుందాయ్ వెన్యూ అత్యంత ప్రజాదరణ పొందిన బెస్ట్-సెల్లింగ్ ఫ్యామిలీ ఎస్‌యూవీ. ఇప్పుడీ కారు నెక్ట్స్ జనరేషన్ మోడల్‌ రిలీజ్ కు రెడీగా ఉంది. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..

పలు నివేదికల ప్రకారం 2025 నవంబర్ 4న హ్యుందాయ్ కొత్త వెన్యూ మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. ఇప్పటికే దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న ఎస్ యూవీల్లో వెన్యూ ఒకటి. అయితే ఇప్పుడు ఈ సిరీస్ కు పెద్ద అప్‌డేట్ రానుంది. అంతేకాకుండా కొత్త వెన్యూ సిరీస్ లో ‘ఎన్’ లైన్ అనే కొత్త మోడల్ ను కూడా లాంచ్ చేసే ప్లా్న్ లో ఉంది. హ్యుందాయ్.


ఎక్స్‌టీరియర్ లుక్

ఇక కొత్త వెన్యూ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ కారు డిజైన్ పూర్తిగా మారిపోనుంది. పాత వెన్యూ కంటే కొత్తగా స్టైలిష్ లుక్‌తో ఉంటుంది.  కొత్తగా డిజైన్ చేసిన ఏరో డైనమిక్ డిజైన్, కొత్త అల్లాయ్ వీల్స్, అప్‌డేట్ చేసిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, రూఫ్ రెయిల్స్ వంటివి కొత్త వెన్యూ ఎక్స్‌టీరియర్ అట్రాక్షన్స్‌.

ఇంటీరియర్ లుక్

కొత్త వెన్యూ ఇంటీరియర్ లుక్ కూడా పూర్తిగా మారనుంది. కర్వ్‌డ్ డిస్‌ప్లే డాష్‌బోర్డ్‌, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్,  కలర్‌ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్,  సరికొత్త ఎయిర్ వెంట్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

ఇంజిన్

ఇక ఇంజిన్ విషయానికొస్తే ప్రస్తుత వెన్యూ మోడల్‌లో ఉన్న ఇంజిన్ ఆప్షన్స్ కొనసాగే అవకాశం ఉంది.  1.2-లీటర్ పెట్రోల్,  1.0- లీటర్ టర్బోచార్జ్‌డ్ పెట్రోల్ తో పాటు1.5 లీటర్ డీజిల్ యూనిట్ ఆప్షన్స్ ఉంటాయి. కొత్త మోడల్ ధరలు రూ. 8 లక్షల నుండి రూ. 13 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.