Amaravathi : జగన్ ఆవిష్కరించిన స్థూపం ధ్వంసం

అమరావతి ప్రాంతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించిన స్థూపాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ప్రాంతంలో జగన్ పేదలకు ఇళ్ల స్థలాలను కేటాయించారు.


ఆ సమయంలో కృష్ణాయపాలెం శివారులో శంకుస్థాపన చేశారు. నమూనా ఇంటితో పాటు, స్థూపాన్ని కూడా ఆ సమయంలో ఏర్పాటు చేశారు.

గుర్తు తెలియని వ్యక్తులు…అయితే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన స్తూపాన్ని, శిలాఫలకాన్ని జేసీబీతో ధ్వంసం చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై వైసీపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. పేదలకు ఇచ్చిన ఇంటి స్థలాల విషయంలో ఇలా వ్యవహరించడమేంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.