దేవర.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన పేరే వినిపిస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఇటీవలే విడులైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ యాక్షన్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలోనే దేవర టికెట్స్ రేట్స్ ను పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను మేకర్స్ కోరారు. దాంతో టికెట్ల రేట్లు హైక్ చేసుకునేందుకు రెండు ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. మరి టికెట్లు రేట్లు ఎంతెంత పెరిగాయో ఇప్పుడు చూద్దాం.
పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన దేవర మూవీ కోసం ఇండియా వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో వస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలు కాస్త ట్రైలర్ రిలీజ్ తర్వాత ఇంకాస్త ఎక్కువైయ్యాయి. ఇక తారక్ అండ్ టీమ్ ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. మరీ ముఖ్యంగా బాలీవుడ్ పై గట్టి ఫోకస్ పెట్టారు. అక్కడ భారీ ఓపెనింగ్స్ రాబట్టడమే లక్ష్యంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు తారక్. ఇదిలా ఉండగా.. దేవర టికెట్ల రేట్లు పెంచుకుంటామని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలను కోరారు మేకర్స్. ఇందుకు రెండు ప్రభుత్వాలు కూడా అనుమతులు ఇచ్చాయి.
దేవర మూవీ టికెట్ల రేట్లను పెంచుకోవడానికి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. దాంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన టికెట్ల రేట్లు ఇలా ఉన్నాయి.. నైజాం ఏరియాలో ఉన్న మల్టీప్లెక్స్ ల్లో రూ. 413, అలాగే సింగిల్ స్క్రీన్లలో రూ. 250 పెరిగాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లోని మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 325, సింగిల్ స్క్రీన్లలో రూ. 200 పెంచుకునేందుకు అనుమతులు ఇచ్చాయి. మెుదటి వారం వరకు పెంచిన ఈ టికెట్ల రేట్లే కంటిన్యూ అవ్వనున్నాయి. కాగా.. ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రాలకు టికెట్ల ధరలను పెంచాలని మేకర్స్ ప్రభుత్వాలను కోరం సాధారణమే. గతంలో ఎన్నో సినిమాల విషయంలో టికెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. ఇదిలా ఉండగా.. 12AM స్పెషల్ షోల టికెట్ ధరను రూ. 1,000 వరకు, ఉదయం 4 గంటల షోలకు రూ. 500 వరకు పెంచాలని దేవర నిర్మాతలు నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణలు ప్రభుత్వాలను కోరినట్లు తెలుస్తోంది. ఇక సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా దేవర బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి వస్తోంది.