హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒకొక్క రోజు ఒకొక్క దేవీదేవతలకు అంకితం చేయబడింది. ఈ నేపధ్యంలో శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చేసే చర్యలు లక్ష్మీ దేవి ఆశీర్వాదం జీవితాంతం కురుస్తుందని నమ్మకం.
అంతేకాదు శుక్రవారం రోజున కొన్ని పనులు చేస్తే ధనలక్ష్మికి కోపం వస్తుంది. లక్ష్మీదేవి ఆగ్రహం కలిగితే భక్తులు దారిద్య్రానికి గురవుతారు. లక్ష్మీదేవి ఆగ్రహిస్తే ధనవంతుల నుంచి పేదవారిగా మారడానికి ఎక్కువ సమయం పట్టదని అంటారు. కనుక వాస్తుశాస్త్రం ప్రకారం ఈ రోజున కొన్ని రకాల వస్తువులను కొనకండి లేదా ఇంట్లోకి తీసుకురాకండి.
శుక్రవారం రోజున ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవికి ఆగ్రహం రాకూడదు అని అనుకుంటే శుక్రవారం పొరపాటున కొన్ని రకాల వస్తువులను కొనుగోలుచేయకూడదు.
శుక్రవారం రోజున పొరపాటున వంటగది వస్తువులను కొనుగోలు చేయకూడదు ఇది జీవితంలో వివిధ సమస్యలను, ఇబ్బందులను పెంచుతుంది.
జ్యోతిష్యం ప్రకారం శుక్రవారం పొరపాటున ఎలాంటి ఆస్తి లావాదేవీలు చేయకండి. వీటన్నింటి నుంచి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి లేకపోతే కుటుంబం దాని పర్యవసానాలను అనుభవించవలసి ఉంటుంది.
శుక్రవారం పొరపాటున ఎవరికీ స్వీట్లు ఇవ్వకండి. అప్పుడు శుక్రుడు బలహీనంగా మారవచ్చు. ఇంటి శాంతికి కూడా భంగం కలుగుతుంది.
శుక్రవారం పొరపాటున కూడా డబ్బులను ఇచ్చి పుచ్చుకోవడం చేయవద్దు. డబ్బుల విషయంలో ఈ చర్యను చేయడం వలన లక్ష్మీదేవికి కూడా కోపం రావచ్చు.
పొరపాటున కూడా ఇంటిని మురికిగా లేదా అపరిశుభ్రంగా ఉంచవద్దు. పరిశుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుందని గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఇంటి పూజా గదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
చిరిగిన లేదా మురికి బట్టలు ధరిస్తే నవ గ్రహాలలో ఛాయా గ్రహం రాహువుకి ఆగ్రహం కలుగుతుంది. రాహువు అటువంటి వ్యక్తీ ఆరోగ్యానికి హానిని చేయవచ్చు. కనుక శుక్రవారం రోజున శుభ్రమైన దుస్తులు ధరించండి. లక్ష్మిదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.
Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి