బిర్యానీ ఆకుతో షుగర్ వ్యాధి కంట్రోల్.. ఎలా వాడాలంటే

www.mannamweb.com


ప్రస్తుత కాలంలో షుగర్‌తో బాధ పడేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగి పోతుంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్‌లో మార్పుల కారణంగా దీర్ఘకాలిక వ్యాధులు ఎటాక్ చేస్తున్నాయి.

వయసుతో సంబంధం లేకుండా అందరూ డయాబెటీస్‌ బారిన పడుతున్నారు. షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయాలంటే.. ఖచ్చితంగా ప్రతి రోజూ ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సిందే. కానీ మందులు వేసుకోకుండా.. మీరు తీసుకునే ఆహారంతోనే షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు. డయాబెటీస్‌ను కంట్రోల్ చేయడంలో బిర్యానీ ఆకు ఎంతో చక్కగా పనిచేస్తుందని ఇటీవల జరిగిన పలు పరిశోధనల్లో తేలింది. మరి ఈ ఆకును ఎలా తీసుకోవాలో, బిర్యానీ ఆకుతో ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

షుగర్ తగ్గించేందుకు ఇలా తీసుకోండి:

ముందుగా ఓ పది బిర్యానీ ఆకులు తీసుకోండి. అందులో మూడు గ్లాసుల నీటిని వేసి.. ఓ పది నిమిషాలు మీడియం మంట మీద మరిగించాలి. ఆ తర్వాత ఈ నీటిని.. రోజులో మూడు సార్లు తీసుకోండి. కావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా తేనె కూడా మిక్స్ చేసుకుని తాగవచ్చు. కానీ నేరుగా తాగితేనే రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. భోజనం చేసే ఓ గంట ముందు ఈ నీటిని తాగాలి. ఇలా మూడు రోజుల పాటు తాగాలి. మళ్లీ ఓ రెండు వారాలు గ్యాప్ ఇచ్చి.. మళ్లీ మూడు రోజులు బిర్యానీ ఆకుల కషాయాన్ని తాగాలి. ఇలా చేయడం వల్ల షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది.

ఆకుల పొడి..

కేవలం కషాయ రూపంలోనే కాకుండా.. బిర్యానీ ఆకుల పొడిని కూడా ఉపయోగించవచ్చు. ఈ పొడిని ఉదయం, సాయంత్రం తినే గంట ముందు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల మధుమేహం అనేది కంట్రోల్ అవుతుంది.

ఇతర ప్రయోజనాలు:

* బిర్యానీ ఆకుల నీటిని తాగడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ నీటిని తాగితే శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కరుగుతుంది. దీంతో గుండె సమస్యలు రాకుండా ఉంటాయి.

* బ్రెస్ట్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడే లక్షనాలు కూడా ఈ ఆకుల్లో ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.

* ఈ నీటిని తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన కూడా దూరం అవుతాయి. కిడ్నీల్లో రాళ్లు కూడా కరుగుతాయి.

* కాళ్లు, కీళ్లు, శరీర నొప్పులు, వాపులు తగ్గుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )