సాధారణంగా వచ్చే సమస్యల్లో షుగర్ వ్యాధి కూడా ఒకటి. మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారిపోయింది. జ్వరం, జలుబు, దగ్గు లాగానే డయాబెటీస్ కూడా వచ్చేస్తుంది.
కానీ ఇది వచ్చాక మీ జీవితంలో తగ్గదు. కేవలం మందులు, ఆహారాల ద్వారానే కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి ఇది రాక ముందు నుంచే జాగ్రత్తలు పడాలి. వచ్చాక మాత్రం ఏమీ చేయలేం. ఇప్పుడు అనేక మంది ఈ షుగర్‌తో బాధ పడుతున్నారు. షుగర్ వచ్చిన వాళ్లు ఏవి పడితే అవి తినలేరు. వీరికంటూ ఓ ప్రత్యేకమైన డైట్ మెయిన్‌టైన్ చేయాలి. లేదంటే ప్రాణానికే ప్రమాదం. ఇష్టమైన ఆహారాలను కూడా వదులు కోవాల్సి ఉంటుంది. షుగర్ ఉన్నవాళ్లు ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఉండాలంటే.. పక్కాగా టైమ్ టూ టైమ్ డైట్ మెయిన్ టైన్ చేయాలి. ఇలా షుగర్‌ను కంట్రోల్ చేసే వాటిల్లో ఈ కూరగాయలు కూడా ఒకటి. ఇప్పుడు చెప్పే వెజిటేబుల్స్.. రక్తంలో షుగర్ లెవల్స్‌ని అమాంతం తగ్గిస్తాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.
గుమ్మడి కాయ:
షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేసే వాటిల్లో గుమ్మడి కాయ కూడా ఒకటి. గుమ్మడి కాయలో ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. కాబట్టి ఇవి రక్తంలో చక్కెర శాతాన్ని తక్కువగా చేస్తాయి. షుగర్ వ్యాధిని తగ్గించుకోవడానికి అనేక దేశాలు గుమ్మడికాయను ఉపయోగిస్తున్నారు.
బెండకాయలు:
షుగర్ ఉన్నవాళ్లు బెండకాయ తినడం వల్ల కూడా డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. ఇందులో అనేక రకాలైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. అలాగే ఫైబర్ శాతం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి తినడం వల్ల రక్తంలో చక్కెర శోషణను నెమ్మదిస్తుంది. షుగర్ లెవల్స్‌ని అదుపు చేస్తుంది.
ముల్లంగి:
డయాబెటీస్‌ను కంట్రోల్ చేసే వాటిల్లో ముల్లంగి కూడా ఒకటి. ముల్లంగి తరచూ తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అనేది అదుపులో ఉంటాయి. అంతే కాదు బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ముల్లంగి జ్యూస్ తాగినా, ఆహారంగా తీసుకున్నా మంచిదే.
క్రూసిఫర్ జాతికి చెందిన కూరగాయలు:
క్రూసిఫర్ జాతికి చెందిన కూరగాయల్లో క్యాలీ ఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ ఇలా వీటిల్లో ఏది తీసుకున్నా కూడా డయాబెటీస్ అనేది నియంత్రణలోకి వస్తుంది. తరచూ మీ డైట్‌లో ఇవి ఉండేలా చూసుకుంటూ.. వైద్యుల్ని సంప్రదించడం వల్ల షుగర్ లెవల్స్ తగ్గించుకోవచ్చు. అదే విధంగా టమాటా, పాలకూర వంటివి తీసుకున్నా మంచిదే.