గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో పెద్దగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కొబ్బరి నూనె మరియు ఆలివ్ నూనె మధ్య ఏది ఎంచుకోవాలో స్పష్టత కావాలి.
నిపుణుల ప్రకారం, ఆలివ్ ఆయిల్‌లో మోనోఅన్‌సాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉండటంతో ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ (HDL) స్థాయిని పెంచుతాయి.
Olive Oil vs Coconut Oil : ఏ నూనె మంచిది అంటే..
అంతేకాక, ఇందులో యాంటీఆక్సిడెంట్లు, పాలిఫెనాల్స్ ఉండటంతో శరీరంలోని వాపులు తగ్గుతాయి, రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వినియోగం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. కొబ్బరి నూనెలో ఎక్కువ సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి గుండె జబ్బులకు దారితీయవచ్చు. అయితే కొబ్బరి నూనెలో ఉండే MCTs (మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్) శరీరానికి తాత్కాలిక శక్తిని ఇవ్వగలవు. కానీ దీని పొటెన్షియల్‌పై స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు ఇంకా లేవు.
నిపుణులు సూచిస్తున్నది ఒక్కటే ..గుండె ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రోజువారీ వంటలకు ఆలివ్ నూనె వాడటం ఉత్తమం. కొబ్బరి నూనెను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు కానీ, అది పరిమితంగా వాడటం మంచిదని వారు హెచ్చరిస్తున్నారు. ప్రతి రోజు వంటలకు – ఆలివ్ నూనె, రుచి కోసం అప్పుడప్పుడూ – కొబ్బరి నూనె వాడడం బెస్ట్ అంటున్నారు.
































