వాట్సాప్‌లో ఇది తెరిచారో మీ డబ్బులు గోవిందా

వ్యవసాయ రంగంలోనూ టెక్నాలజీ వాడుతున్నారు. వ్యవసాయ పనుల నుంచి రైతులకు సంబంధించిన సమాచారం అందించేందుకు మొబైల్ ను ఉపయోగిస్తున్నారు.


రైతులకు సలహాలు, ప్రభుత్వం నుంచి అందే సమాచారం వంటివి వాట్సాప్ లేదా ఇతర యాప్ ద్వారా మెసేజ్లు వస్తున్నాయి. అయితే కొందరు సైబర్ నేరగాళ్లు ప్రభుత్వం నుంచి మెసేజ్ పంపిస్తున్నట్లుగా క్రియేట్ చేసి కొన్నింటిని సెండ్ చేస్తున్నారు. ఇవి ప్రభుత్వానికి సంబంధించినవేనని ఓపెన్ చేస్తున్నారు. కానీ ఇవి ఓపెన్ కాగానే రైతుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు మాయమవుతున్నాయి. ఇలాంటి వాటి విషయాలను పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇటీవల ఓ మెసేజ్ అందరినీ కలవరపెడుతుంది. ఇంతకీ ఆ మెసేజ్ ఏంటంటే?

జాగ్రత్త..! ఇన్ స్టాగ్రామ్ లో ఇక అలాంటి పోస్టులు పెడితే జైలుకే..

మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్స్అప్ తప్పనిసరిగా వాడుతూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతుల వద్ద కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వ్యవసాయానికి సంబంధించిన ఏ సమాచారం అయినా మొబైల్ ద్వారా తెలుసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి ఏదైనా సమాచారం కూడా రైతుల మొబైల్ నెంబర్ కి నేరుగా పంపిస్తున్నారు. ఇదే సమయంలో కొన్ని మెసేజ్లను వాట్సాప్ ద్వారా కూడా పంపిస్తున్నారు. ఇటీవల పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం గురించి చర్చ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రతి రైతుకు రూ. 6000 చెల్లిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మొత్తం మూడు విడతలుగా పంపిణీ చేస్తుంది.

2025 సంవత్సరంలో ఫిబ్రవరిలో మొదటి విడతగా.. రూ 2000 ను అందించారు. రెండో విడత జూలైలో అందిస్తున్నట్లు చర్చ జరుగుతుంది. ఈ సమయంలో ఇప్పటివరకు పీఎం కిసాన్ డబ్బులు రానివారు.. తమ అకౌంట్లను ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం తెలుపుతుంది. ఈ క్రమంలో పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కు అర్హులైన వారి జాబితాను రిలీజ్ చేస్తున్నట్లు కొందరు ఒక ఫైల్ను పంపిస్తున్నారు. ఈ ఫైల్ చివరన .apk అని ఉంటుంది. అయితే ఇప్పటికే ఇలాంటి ఫైల్ ఓపెన్ చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. కానీ చాలామంది రైతులు అవగాహన లేకుండా దీనిని ఓపెన్ చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకంలో తమ పేరు ఉందో? లేదో? తెలుసుకోవడానికి దీనిని ఓపెన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఓపెన్ చేసిన క్రమంలో రైతుల ఖాతాల్లో ఉన్న డబ్బులు మాయమవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామానికి చెందిన రాంబాబు అనే ఎరువుల దుకాణం నడిపే యజమాని ఈ ఫైల్ ను ఓపెన్ చేశాడు. అతని ఖాతా నుంచి ముందుగా రూ. 49,500.. రూ. 10,000..రూ. 10,000 డబ్బులు మాయమైనట్లు ఆయన పోలీసులకు తెలిపారు. ఇలాగే ఇప్పటివరకు చాలామంది రైతుల ఖాతాల నుంచి డబ్బులు డ్యూటీ చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

అందువల్ల రైతులు ఇప్పటికైనా తమ పేరును చెక్ చేసుకోవాలంటే సమీప వ్యవసాయ కార్యాలయంలోకి వెళ్లి సంప్రదించాలని.. వాట్సాప్ లో వచ్చే ఎలాంటి మెసేజ్ ను పట్టించుకోవద్దని పోలీసులు తెలుపుతున్నారు. అలాగే ఇలాంటి ఫైలు వస్తే వెంటనే దానిని డిలీట్ చేయాలని.. గ్రూప్ అడ్మిన్ లకు తెలుపుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.