రామ్ చరణ్ తుదపరి చిత్రం గేమ్ ఛేంజర్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టాయిలో తెరకెక్కుతోన్న ఈ పై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం ఎప్పుడు విదలవుతుందా.? అని అభిమానులతో పాటు యావత్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది. ట్రిపులార్ తర్వాత వస్తోన్న చిత్రానికి సంబంధించి తాజాగా నిర్మాత దిల్‌రాజ్ కీలక ప్రకటన చేశారు.
తాజాగా ‘రాయన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న దిల్ రాజ్ గేమ్ ఛేంజర్ విడుదలపై స్పందించారు. స్టేజ్‌పై మాట్లాడుతున్న దిల్ రాజును అభిమానులు గేమ్ ఛేంజర్ విడుదల ఎప్పుడంటూ అడిగారు. దీనికి బదులిస్తూ.. గేమ్ ఛేంజర్ చిత్రం క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. దీంతో చెర్రీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గేమ్ ఛేంజర్ విడుదల తేదీకి సంబంధించి అప్‌డేట్ వచ్చేసింది. భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమని అభిమానులు ఆశతో ఉన్నారు.
ఇదిలా ఉంటే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ లో రామ్ చరణ్‌కు జోడిగా కియారా అడ్వాణీ నటిస్తోంది. అంజలి, ఎస్. జె. సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక శంకర్ దర్శకత్వంలో తాజాగా వచ్చిన భారతీయుడు 2 ఆశించిన స్థాయిలో విజయాన్న అందుకోలేకపోవడంతో గేమ్ ఛేంజర్‌పైనే ఆశలన్నీ పెట్టుకున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శంకర్ మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ విడుదల ఇటీవల ఉండదనే హింట్ ఇచ్చారు. అయితే తాజాగా దిల్ రాజు ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఇక శంకర్ తెలుగులో తెలుగులో తెరకెక్కిస్తున్న తొలి మూవీ గేమ్ ఛేంజర్ కావడం విశేషం. ఇప్పటి వరకు తమిళంలో తెరకెక్కిన లు తెలుగులో డబ్ అవుతూ వచ్చాయి. అయితే తొలిసారి శంకర్ తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేస్తున్నారు. ఇదే విషయమై శంకర్ మాట్లాడుతూ.. తాను దర్శకత్వం వహించిన చాలా చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ లభించిందని, అందుకే తెలుగులో ఓ తీయాలని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాణ్ని. ఆ మేరకు చేసిన కొన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎట్టకేలకు ‘గేమ్ ఛేంజర్’తో తన కల నెరవేరబోతోందని శంకర్ చెప్పుకొచ్చారు.