బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. చౌకైన రీఛార్జ్‌తో 5 నెలల వ్యాలిడిటీ

www.mannamweb.com


దేశంలోని ప్రైవేట్ కంపెనీలు ప్లాన్‌ల ధరలను పెంచిన తరువాత, వేలాది మంది వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) వైపు ఆకర్షితులవుతున్నారు. అటువంటి పరిస్థితిలో తన వినియోగదారుల కోసం ప్రతిరోజూ కొత్త ప్లాన్‌లను ప్రవేశపెడుతోంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ దేశంలో తన నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరించే పనిలో ఉంది. అదే సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ 4G సేవ కూడా మార్చి 2025 నాటికి దేశవ్యాప్తంగా ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అటువంటి పరిస్థితిలో ఈ రోజు బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్లాన్ గురించి తెలుసుకుందాం. దీనిలో మీరు రోజువారీ 2GB ఇంటర్నెట్ డేటా అలాగే అపరిమిత కాలింగ్ పొందుతారు. దీని వాలిడిటీ కూడా 5 నెలల వరకు ఉంటుంది.

400 కంటే తక్కువ ప్లాన్

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ప్లాన్ ధర కేవలం రూ. 397. ఈ సిమ్‌ని తమ స్మార్ట్‌ఫోన్‌లో సెకండరీ సిమ్‌గా ఉంచుకునే వారికి ఉత్తమంగా ఉంటుందనే చెప్పాలి. ఎందుకంటే తక్కువ రీఛార్జ్‌ ప్లాన్‌.. ఎక్కువ వ్యాలిడిటీతో కూడుకున్నది. చౌక ప్లాన్ వాలిడిటీ 5 నెలలు, అంటే ఒకసారి రీఛార్జ్ చేసిన తర్వాత, మీరు 150 రోజుల వరకు ఎలాంటి రీఛార్జ్ చేయనవసరం లేదు.

ఈ ప్రయోజనాలను పొందుతారు:

BSNL ఈ రూ. 397 ప్లాన్‌లో వినియోగదారులు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ ప్లాన్‌లో వినియోగదారులు 30 రోజుల పాటు అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. అంటే మీరు ఏ నెట్‌వర్క్‌లోనైనా కాల్స్ చేసుకోవచ్చు. అయితే, కంపెనీ వినియోగదారులకు 150 రోజుల పాటు ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్‌ని కొనుగోలు చేసిన తర్వాత మీరు నంబర్ క్లోజర్ టెన్షన్ నుండి విముక్తి పొందుతారు.

మొదటి 30 రోజులు, మీరు రోజువారీ 2 GB ఇంటర్నెట్ డేటాతో పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని పొందుతారు. డేటా పరిమితి ముగిసిన తర్వాత మీరు 40Kbps వేగం పొందుతారు. మీరు మొదటి 30 రోజులపాటు ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 100 ఉచిత SMSలను కూడా పొందుతారు. అటువంటి పరిస్థితిలో ప్రజలు తమ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ చౌక ప్లాన్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.