కవాసకి నింజా 500 బైక్‌పై తగ్గింపు.. డిస్కౌంట్ కొన్ని రోజులు మాత్రమే

www.mannamweb.com


కస్టమర్లను ఆకర్శించేందుకు వివిధ కంపెనీలు బైకులపై డిస్కౌంట్ ప్రకటిస్తుంటాయి. తాజాగా కవాసకి బైక్‌ మీద కూడా కంపెనీ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి తన కొన్ని బైక్‌లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. ఇందులో కవాసకి నింజా 500 బైక్ కూడా ఉంది. కవాసకి నింజా 500 బైక్‌పై రూ.10,000 తగ్గింపు ఇస్తుంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఈ కవాసకి నింజా 500 సూపర్ బైక్ కొనాలి అనుకునేవారికి ఇది గొప్ప అవకాశం.

కవాసకి నింజా 500 ధర ప్రస్తుతం రూ. 5.24 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ఇప్పుడు రూ.10,000 తగ్గింపు తర్వాత ఈ కవాసకి బైక్ ధర రూ. 5.14 లక్షలకు వస్తుంది. ఇది ఆర్టీఓ, బీమా ఖర్చులను కొన్ని వేలకు పైగా తగ్గిస్తుంది. అందువల్ల, ఆన్-రోడ్ ధరపై దాదాపు రూ.12,000 నుండి రూ.13,000 వరకు తగ్గింపును ఆశించవచ్చు.

బైక్ ఫీచర్లు

ఈ కవాసకి నింజా 500 బైక్‌లో కొత్త లిక్విడ్ కూల్డ్, 451సీసీ, సమాంతర-ట్విన్ ఇంజన్‌ని అమర్చారు. ఈ ఇంజన్ 9,000ఆర్పీఎమ్ వద్ద 45 బీహెచ్‌పీ మరియు 6,000ఆర్బీఎమ్ వద్ద 42.6 ఎన్‌ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజన్ పవర్‌ట్రెయిన్, ఎలిమినేటర్ 500 క్రూయిజర్.. వినూత్నమైన నింజా 7 హైబ్రిడ్ బైక్‌లో కూడా ఉపయోగిస్తున్నారు.

కవాసకి నింజా 500 మోడల్ బరువు 171 కిలోలు, ఇది నింజా 400 బైక్ కంటే బరువుగా ఉంటుంది. ఈ నింజా 500 బైక్ బరువు దాని ప్రత్యర్థులైన Aprilia RS 457, KTM RC 390 బైకుల కంటే తక్కువ. బైక్‌లో డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంది. సీటు ఎత్తు సౌకర్యవంతమైన 785 mmగా ఉంటుంది.
బ్లూటూత్ కనెక్టివిటీ

కవాసకి నింజా 500 బైక్ మోడల్ ముందు కొత్త డిజైన్ ఉంది. ఇది ZX-6R, నింజా 7 హైబ్రిడ్‌తో సహా తాజా కవాసకి స్పోర్ట్ బైక్‌లకు సరిపోలుతుంది. ఈ బైక్ బ్లూటూత్ కనెక్టివిటీ, పూర్తి నలుపు రంగుతో LCD డాష్‌తో కూడిన మోడల్. అప్-స్పెక్ SE వేరియంట్ కోసం రిజర్వ్ చేశారు. కవాసకి నింజా 500 బైక్ మోడల్ భారతీయ మార్కెట్లో యమహా ఆర్3, అప్రిలియా ఆర్ఎస్ 457 మరియు కేటీఎమ్ ఆర్‌సీ 390 బైక్‌లకు పోటీగా ఉంది.

కవాసకి హైడ్రోజన్ బైక్

మరోవైపు కవాసకి తన మొదటి హైడ్రోజన్‌తో నడిచే ద్విచక్ర వాహన మోడల్‌ను ఆవిష్కరించింది. పెట్రోలు, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయ వాహనాల వినియోగం వైపు ప్రపంచం వేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో కవాసకి హైడ్రోజన్ ద్విచక్ర వాహనాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కవాసకి నింజా హెచ్2 ఎస్ఎక్స్ మోడల్ ఆధారంగా హైడ్రోజన్ పవర్డ్ బైక్‌ను సిద్ధం చేసింది.

కవాసకి కంపెనీ హైడ్రోజన్ స్మాల్ మొబిలిటీ, ఇంజిన్ టెక్నాలజీని అభివృద్ధి చేయడంలో చాలా కాలంగా కృషి చేస్తోంది. కవాసకి గత సంవత్సరం దీనిపై పరిశోధన చేయడం ప్రారంభించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో హైడ్రోజన్ బైక్ మొదటి టెస్ట్ రన్ నిర్వహించింది. త్వరలోనే దీన్ని కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. హైడ్రోజన్ ఇంజన్ H2 లైనప్‌లో కవాసకి 998cc ఇన్-లైన్-ఫోర్ సూపర్‌ఛార్జ్డ్ మోటారుపై ఆధారపడి ఉంటుంది. సిలిండర్‌లలోకి హైడ్రోజన్‌ను నేరుగా పంపడానికి మోటారును అప్‌డేట్ చేసే అవకాశం ఉంది.