కారు అనేది ఇప్పుడు అందరికీ అవసరంగా మారిపోయింది. ముఖ్యంగా మధ్యతరగతి వాళ్లు కూడా కారు కొనాలి అనుకుంటున్నారు. అయితే గతంలో అంటే బడ్జెట్ కార్లకు ఎక్కువ మార్కెట్ ఉండేది. కానీ, ఇప్పుడు ప్రీమియం కార్లకు కూడా మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది. అందులోనూ ఈ హైబ్రిడ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. అందుకే చాలా కంపెనీలు హైబ్రిడ్ కార్లను తయారు చేయడం స్టార్ట్ చేశాయి. ఇప్పటికే నెక్సా నుంచి గ్రాండ్ విటారా, టయోటా నుంచి ఇన్నోవ హైబ్రిడ్ హైక్రాస్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇన్నోవా కాస్త ఖరీదైన కారు. కానీ, గ్రాండ్ విటారాని మధ్యతరగతి వాళ్లు కూడా కొనుగోలు చేసే ఆలోచన చేయచ్చు. పైగా ఇప్పుడు నెక్సా ఈ కారుపై ఏకంగా రూ.1.28 లక్షల వరకు డిస్కాంట్స్ కూడా ప్రకటించింది.
గ్రాండ్ విటారా హైబ్రిడ్:
సాధారణంగా ఇండియన్ మార్కెట్ లో బడ్జెట్ కారు అనగానే కచ్చితంగా మారుతీ కంపెనీ పేరు గుర్తొస్తుంది. అయితే కాస్త ప్రీమియం, లగ్జరీ కార్లు కూడా వినియోగదారులకు అందివ్వలాని నెక్సాని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిలో కాస్త ప్రీమియం కార్లను విడుదల చేస్తూ ఉంటారు. అలాగే నెక్సా నుంచి గ్రాండ్ విటారా హైబ్రిడ్ వచ్చిన విషయం తెలిసిందే. సాధారణంగా మారుతీ అడపాదడపా కార్లపై డిస్కౌంట్స్ ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పుడు విటారా మీద ప్రకటించిన డిస్కౌంట్ అందరినీ ఆకర్షిస్తోంది. ఈసారి గ్రాండ్ విటారాపై ఏకంగా రూ.1.28 లక్షల వరకు డిస్కౌంట్స్ ప్రకటించింది. గ్రాండ్ విటారా స్ట్రాంగ్ హైబ్రిడ్ వర్షన్ పై కార్పొరేట్ డిస్కౌంట్స్, క్యాష్ డిస్కౌంట్స్ అన్నీ కలిపి రూ.1.03 లక్షల వరకు డిస్కౌంట్స్ ఇస్తున్నారు.
డిస్కౌంట్స్ కి అదనంగా మీ పాత డీజిల్ కారును ఎక్స్ ఛేంజ్ చేసుకుంటే రూ.25 వేల బోనస్ ని ఇస్తున్నారు. అంటే మీకు స్ట్రాంగ్ హైబ్రిడ్ పై మొత్తంగా రూ.1.28 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. మైల్డ్ హైబ్రిడ్ వర్షన్ పై రూ.63 వేల వరకు డిస్కౌంట్స్ ప్రకటించారు. అలాగే సీఎన్జీ వర్షన్ పై రూ.30 వేల వరకు డిస్కౌంట్స్ ఇస్తున్నారు. అలాగే మీకు ఐదేళ్ల ఎక్స్ టెండెడ్ వారెంటీ లభిస్తోంది. మొన్నటి వరకు అది కేవలం 3 ఏళ్ల వరకు మాత్రమే ఉంది. అలాగే స్టాండర్డ్ వారెంటీని కూడా పెంచేశారు. గతంలో స్టాండర్డ్ వారెంటీ రెండేళ్లు లేదా 40 వేల కిలోమీటర్లుగా ఉండేది. దానిని ఇప్పుడు మూడేళ్లు లేదా లక్ష కిలోమీటర్లకు పెంచారు. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ ఈ నెల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి అంటున్నారు. పూర్తి వివరాల కోసం మీ దగ్గర్లోని డీలర్ ని సంప్రదిస్తే మంచిది.
గ్రాండ్ విటారా హైబ్రిడ్ స్పెసిఫికేషన్స్:
ముందుగా ఈ గ్రాండ్ విటారా హైబ్రిడ్ ధరల గురించి మాట్లాడుకుంటే.. మైల్డ్ హైబ్రిడ్ ఎక్స్ షోరూమ్ ధర రూ.10.99 లక్షల నుంచి రూ.16.91 లక్షల వరకు ఉంటుంది. అలాగే స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎక్స్ షోరూమ్ ధర రూ.18.43 లక్షల నుంచి 19.93 లక్షల వరకు ఉంటుంది. ఇంక సీఎన్జీ వర్షన్ ఎక్స్ షోరూమ్ ధర రూ.13.15 లక్షల నుంచి రూ.14.96 లక్షల వరకు ఉంటుంది. ఈ గ్రాండ్ విటారా హైబ్రిడ్ 1462 సీసీ న్యారల్లీ యాస్పైర్డ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ వర్షన్స్ ఉన్నాయి. ఇంక స్ట్రాంగ్ హైబ్రిడ్ లో మీకు టయోట సోర్స్డ్ 1.5 లీటర్ త్రీ సిలిండర్ అట్కిన్సన్ సైకిల్ ఇంజిన్ లభిస్తుంది.