దీపావళి ధమాకా.. ఈ కార్లపై రూ.3,00,000 మేర తగ్గింపు.. టాప్-5 కార్లు ఇవే

మీరు ఈ దీపావళి రోజున కొత్త కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకు బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని కార్లపై ఏకంగా రూ.3 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా డిస్కౌంట్ ఆఫర్లు ఉన్న టాప్ 5 కార్ల గురించి ఈ కథనం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

దేశవ్యాప్తంగా దీపావళి శోభ నెలకొంది. ధంతేరాస్ రోజున బంగారం షాపులతో పాటు ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువుల దుకాణాలు కొనుగోలుదారులకతో కిక్కిరిసిపోయాయి. ఇక కార్ల షోరూములు సైతం కస్టమర్లతో నిండిపోయాయి. మీరు కూడా ఈ దీపావళికి కొత్త కారు కొనేందుకు సిద్ధమవుతుంటే మీకు మంచి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు మీరు తగ్గింపు పొందవచ్చు. తక్కువ ధరకే కొత్త టాప్, ఎస్‌యూవీ కారును మీరు ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఫ్యామిలీ కోసం మంచి కారు కొనే వారికి ఇదే సరైన సమయంగా చెప్పవచ్చు. మరి టాప్-5 కార్లలో ఏ కారుపై ఎంత తగ్గింపు పొందవచ్చు అనేది తెలుసుకుందాం.


మహీంద్రా మరాజ్జో (Mahindra Marazzo)

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన ఈ కారు మరాజ్జోపై ఏకంగా రూ.3 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. మల్టీ పర్పస్ వెహికల్ సెగ్మెంట్‌లో సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రసిద్ధి చెందిన కారు ఇది. పెద్ద కారు కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.14 లక్షల నుంచి రూ.16.38 లక్షల వరకు ఉంటుంది.

స్కోడా కుషాక్ (Skoda kushaq)

.మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్‌తో కఠినమైన రోడ్లపైనా సులభంగా ప్రయాణించగలుగుతుంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.10.61 లక్షల నుంచి రూ.18.43లక్షల వరకు ఉంది.

మహీంద్రా ఎక్స్‌యూవీ 400 (Mahindra XUV 400)

విద్యుత్తు కారు కొనాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. ఈ కారుపై దీపావళి సందర్భంగా రూ.2.50 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. మంచి డిజైన్, అద్భుతమైన పీచర్లతో ప్రజల నుంచి ఆదరణ పొందుతోంది. ప్రస్తుత తగ్గింపుతో మరింత సరమైన ధరకే లభిస్తోంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.15.49 లక్షలు నుంచి రూ.17.69 లక్షలుగా ఉంది.

స్కోడా స్లావియా (Skoda Slavia)

స్కోడా నుంచి మార్కెట్లోకి వచ్చిన స్లావియా కారుపై రూ.2.25 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు. ప్రీమియంలో మిడ్ సైజ్ సెడాన్ కారు. మంచి డిజైన్, సౌకర్యవంతమైన, విశాలమైన క్యాబిన్ కలిగి ఉంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.10 లక్షల నుంచి రూ.17.70 లక్షల మధ్య ఉంది.

మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara)

తక్కువ ధరకే మంచి కాంపాక్ట్ ఎస్‌యూవీ కొనాలనుకునే వారికి మారుతీ సుజుకీ గ్రాండ్ విటారా బెస్ట్ ఆప్షన్. దీపావళి సందర్భంగా ఈ కారుపై రూ.1.80 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నారు. మారుతీలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇదీ ఒకటి. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.10.77 లక్షల నుంచి రూ.19.72 లక్షల మధ్య ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.