దీపావళి కానుకగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. పెరిగిన జీతాలు

www.mannamweb.com


ఈ ఏడాది దీపావళికి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు బహుమతిని అందుకోనున్నారు. డియర్‌నెస్ అలవెన్స్‌లో 3 శాతం పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు సమాచారం.

అంటే కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లు కూడా అక్టోబర్ నెలలో పెరిగిన జీతంతో పాటు మూడు నెలల డీఏ బకాయిలను పొందనున్నారు.

ప్రస్తుతం జీతంలో డీఏ 50 శాతం ఉండగా, పెంపు ఆమోదం పొందిన తర్వాత అది 53 శాతం అవుతుంది. మంత్రివర్గ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కరువు భత్యం పెంపుపై అధికారిక ప్రకటన చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వంపై రూ.9,448 కోట్ల ఆర్థిక భారం పెరగనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల 49.18 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 64.89 లక్షల మంది పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.

కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు డీఏ పెంపుదలను ప్రకటిస్తుంది. జనవరి, జూలై, మార్చిలో హోలీ సమయంలో, సెప్టెంబర్‌లో దీపావళి సమయంలో ఆ తర్వాత పెంపు బకాయిలు చెల్లిస్తారు. ముఖ్యంగా ఈ సంవత్సరం జులైలో డీఏ పెంపు గణనీయంగా ఆలస్యం అయింది. ఇది అక్టోబర్ 5న హర్యానా ఎన్నికలకు ముందు ప్రకటించారు. ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ముందు దీని ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు. కేబినెట్‌ నుంచి డీఏకు ఆమోదం లభించిందని సమాచారం.

ఛత్తీస్‌గఢ్‌లో డీఏ ప్రకటన:

మరోవైపు, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డిఎ) 4 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. మొత్తం డీఎను 50 శాతానికి తీసుకువెళ్లారు. రాయ్‌పూర్‌లో విలేకరులతో మాట్లాడిన సీఎం.. ప్రస్తుతం రాష్ట్ర ఉద్యోగులందరికీ 46 శాతం డీఏ ఇస్తున్నామని, వారి డీఏను 4 శాతం పెంచుతున్నామని మా ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇక నుంచి వారికి 50 శాతం డీఏ లభిస్తుంది. ఈ విషయంపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఎక్స్‌లో పోస్ట్ చేసింది.

ఎంఎస్‌పీపై కూడా ప్రకటనలు:

మరోవైపు రైతులకు ఊరటనిస్తూ రబీ పంటలపై ప్రభుత్వం ఎంఎస్‌పీని పెంచుతున్నట్లు ప్రకటించింది. 2025-26కి సంబంధించి 6 రబీ పంటలకు ఎంఎస్‌పీని కేబినెట్ ఆమోదించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గోధుమల ఎంఎస్‌పి క్వింటాల్‌కు రూ.150 పెంచినట్లు వచ్చాయి. ఆవాలపై ఎంఎస్పీ రూ.300 పెరిగింది