దీపావళి పూజ కోసం లక్ష్మి, గణపతి విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారా.. ఈ నియమాలు గుర్తుంచుకోండి

www.mannamweb.com


లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా ఉండాలంటే లక్ష్మీదేవితో పాటు గణపతిని కూడా పూజించాలి. ఎందుకంటే గణపతిని శుభ చిహ్నంగా భావిస్తారు. ఐశ్వర్య ఇంట్లో ఉన్నప్పుడే లక్ష్మిదేవి నివాసం ఉంటుంది.

అందుకే దీపావళి రోజున గణేశుడితో పాటు లక్ష్మీదేవిని విగ్రహన్ని లేదా పటాన్ని తీసుకుని వస్తారు. ఈ విగ్రహాలు మనిషి జీవితాలపై ప్రత్యేక ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈ విగ్రహాలను చాలా జాగ్రత్తగా కొనుగోలు చేయాలి. విగ్రహం కొనుగోలు చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

గణపతి విగ్రహం ఎలా ఉండాలంటే.. గణేశ విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు విగ్రహంలో గణేశ వాహన ఎలుక ఉండటం చాలా ముఖ్యం. అలాగే గణేశుడి చేతిలో లడ్డూలు లేదా మోదకాలు ఉండాలని గుర్తుంచుకోండి. అటువంటి విగ్రహం శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది. కనుక దీపావళికి ఇటువంటి లక్షణాలున్న గణపతి విగ్రహాన్ని కొనుగోలు చేయండి..

మార్కెట్ లో చాలా రకాల లక్ష్మీ గణపతి విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. ఈ గణపతి, లక్ష్మీ దేవి విగ్రహాలు కలిసి లేదా విడిగా ఉన్న విగ్రహాలను కూడా విడివిడిగా కాకుండా కలిపి పూజించాలి.

గణేశుడి విగ్రహాన్ని కొనుగోలు చేసేటప్పుడు, వినాయకుడి మొండెం ఎడమవైపుకు తిరిగి ఉండాలని గుర్తుంచుకోండి.

లక్ష్మీ విగ్రహం ఎలా ఉండాలంటే ఇంట్లో ఎప్పుడూ కూర్చునే లక్ష్మీదేవి విగ్రహాన్ని తీసుకురావాలి. నిలబడి ఉన్న లక్ష్మీ విగ్రహం కదులుతున్నట్లు భావిస్తారు. స్థిరమైన లక్ష్మి కోసం కూర్చున్న లక్ష్మిదేవిని మాత్రమే ఇంటికి తీసుకు రండి. తద్వారా ఆమె ఎల్లప్పుడూ ఇంట్లోనే ఉంటుంది.

గుడ్లగూబపై కూర్చున్న లక్ష్మి దేవి అశుభం. కనుక కమలం లేదా ఏనుగుపై కూర్చున్న లక్ష్మీదేవి చిత్రాన్ని తీసుకురండి.

లక్ష్మిదేవిని సంపదకు దేవతగా పరిగణిస్తారు. కనుక లక్ష్మీదేవి చిత్ర పటంలో సంపద కురిపిస్తున్నట్లు ఉన్న చిత్ర పటాన్ని లేదా అలాంటి విగ్రహాన్ని తీసుకురావడం వల్ల కుటుంబంలో ధన కొరత తీరుతుందని నమ్మకం.

అలాగే మట్టి విగ్రహాన్ని తీసుకువస్తున్నట్లయితే.. కొత్త విగ్రహాన్ని ఇంటికి తెచ్చిన తర్వాత.. పాత విగ్రహాన్ని నీటిలో లేదా మట్టిలో కలపాలని గుర్తుంచుకోండి . లేదా ఇత్తడి, బంగారం, వెండి మొదలైన లోహపు విగ్రహాలను తీసుకువస్తున్నట్లయితే… వాటిని తొలగించాల్సిన అవసరం లేదు. వాటిని ఎల్లప్పుడూ పూజించవచ్చు.