Bhogi 2024: భోగీ పండుగ రోజున ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి..!

సంక్రాంతి పండుగ వస్తుందంటే.. వారం రోజుల నుంచే ఇంటి పనులు మొదలైపోతాయి. ఇంట్లో అన్ని గదులు శుభ్రం చేసి.. దుమ్మూ, ధూళి దులిపేస్తూంటారు. ఇంకొంత మంది పెయింటింగ్స్ కూడా వేయించుకుంటారు.
ఇలా సంక్రాంతి ఫెస్ట్‌కి ఇంటిని ఎంతో అందంగా రెడీ చేసుకుంటారు. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతికి ముందు భోగీ పండుగ వస్తుంది. భోగి రోజు.. భోగి మంటను వేసి.. నీళ్లు కాచి తలారా స్నానం చేసి.. కొత్త బట్టలు ధరించి పూజలు చేసుకుంటారు. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే భోగి పండుగ రోజు.. భోగి పళ్లు పోస్తారు. ఈ సంవత్సరం భోగి పండుల జనవరి 14న వచ్చింది. అయితే భోగి పండుగ రోజు తెలిసీ తెలియక కొంత మంది కొన్ని రకాల పనులు చేస్తూంటారు. ఇలా చేయడం వల్ల ఎన్నో సమస్యల్ని ఎదుర్కొవాల్సి వస్తుంది. మరి భోగి పండుగ రోజు ఏం చేయకూడదో ఇప్పుడు చూద్దాం.


భోగి రోజు చేయాల్సిన పనులు:
* సనాతన ధర్మంలో అగ్నికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అగ్నిని పవిత్రతకు చిహ్నంగా భావిస్తారు. కాబట్టి భోగి రోజు తప్పకుండా అగ్ని దేవుడిని పూజించండి. ఇలా చేస్తే శుభ ఫలితాలు పొందుతారు.

* అలాగే మీ ఇంట్లో ఉండే ఆర్థిక ఇబ్బందులు తొలగాలంటే.. గోధుమలను ఎర్రటి వస్త్రంలో కట్టి అవసరం అయిన వారికి ఇవ్వండి. ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా కలుగుతుంది.

* ఇంటికి దేహీ అంటూ ఎవరు వచ్చినా.. ఉట్టి చేతులతో పంపించకండి. దీని వల్ల మీ ఇంట్లో ఆహారానికి కొదువ ఉండదు.

భోగి రోజు చేయకూడని పనులు:

* భోగి పండుగ రోజు చాలా మంది నాన్ వెజ్ తింటూ ఉంటారు. వీటిని అస్సలు తినకూడదు. అలాగే ఉల్లి, వెల్లుల్లి వంటి ఆహారాలకు కూడా దూరంగా ఉండాలని పెద్దలు చెబుతూ ఉంటారు.
* భోగి పండుగ రోజు నలుపు దుస్తులు ధరించకూడదు. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయట. ఎవరిని కించ పరిచే విధంగా, అవమానించే విధంగా మాట్లాడకూడదు.
* భోగి మంటలో ప్లాస్టిక్ వస్తువులు, వ్యర్థాలు వంటివి వేయ కూడదు. కేవలం కట్టెలు మాత్రమే వేయాలి. దీని వల్ల గాలి కలుషితం కాకుండా ఉంటుంది. దీంతో శ్వాసకోశ సమస్యలు వస్తాయి.