రోజూ మనం తినే ఆహారాలు, తాగే ద్రవాలతోపాటు పాటించే జీవనశైలి కారణంగా మన శరీరంలో కొలెస్ట్రాల్ చేరుతుంటుంది. ఇందులో రెండు రకాలు ఉంటాయి.
ఒకదాన్ని హెచ్‌డీఎల్ అంటారు. ఇదే మంచి కొలెస్ట్రాల్. దీని వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. అందువల్ల హెచ్‌డీఎల్ ఎక్కువగా ఉండాలి. ఇక చెడు కొలెస్ట్రాల్‌నే ఎల్‌డీఎల్ అంటారు.
ఇది తక్కువగా ఉండాలి. ఇది మనకు హాని చేస్తుంది. కనుక శరీరంలో ఇది పేరుకుపోకుండా చూసుకోవాలి. అయితే ఎల్‌డీఎల్ స్థాయిలు పెరిగితే మనకు అనేక సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టినట్లు అవుతుంది.
దీంతో రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా గుండెపై ఒత్తిడి అధికంగా పడుతుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కనుక కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగకుండా ఎప్పటికప్పుడు పరీక్షించుకుని చికిత్స తీసుకోవాలి.
అయితే శరీరంలో ఎల్‌డీఎల్ స్థాయిలు పెరిగితే మనం సులభంగా గుర్తు పట్టవచ్చు. ఎలాగంటే.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే రక్త సరఫరాకు ఆటంకం కలుగుతుంది కనుక కాళ్లకు రక్తం సరిగ్గా చేరదు.
దీంతో ఆ భాగాల్లో నొప్పులు ఉంటాయి. కాసేపు నడిచినా సరే బాగా అలసట వస్తుంది. కాళ్ళల్లో నొప్పులు వస్తాయి. అలాగే రక్త సరఫరా సరిగ్గా జరగదు కనుక కాళ్లు పాలిపోయినట్లు లేదా నీలి రంగులోకి మారుతాయి.
ఈ లక్షణాలు కనుక కనిపిస్తే వెంటనే అప్రమత్తమవ్వాలి. శరీరంలో రక్త సరఫరా సరిగ్గా జరగడం లేదని తెలుసుకోవాలి. వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి. సమస్య ఉన్నట్లు తేలితే చికిత్స తీసుకోవాలి. దీంతో రక్త నాళాల్లో ఉండే కొలెస్ట్రాల్‌ను తొలగించుకోవచ్చు. ఫలితంగా గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
Legs
ఇక ఎల్‌డీఎల్ స్థాయిలు పెరిగితే పలు ఇతర లక్షణాలు కూడా మనకు కనిపిస్తాయి. అవేమిటంటే.. కాళ్లకు సంబంధించిన గోర్లు, కాళ్లపై కింది భాగంలో ఉండే వెంట్రుకలు పెరగవు. అలాగే శృంగార సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. దీంతోపాటు కాళ్లల్లో స్పర్శ సరిగ్గా ఉండదు. కాస్త దూరం నడిచినా చాలు.. ఆయాసం వస్తుంది. బరువు అసలు మోయలేరు. ఛాతిలో ఎడమ వైపు తరచూ నొప్పిగా ఉంటుంది. చేతులు, కాళ్లతో ఏ పని చేసినా నొప్పులుగా ఉంటాయి. కాస్త సేపు పని చేసినా ఆయా భాగాల్లో నొప్పి కలుగుతుంది.
ఇలా ఇవన్నీ ఎల్‌డీఎల్ స్థాయిలు పెరిగాయని చెప్పేందుకు కనిపించే లక్షణాలే. అందువల్ల ఈ లక్షణాలు ఎవరిలో అయినా కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకోవాలి. ఒక వేళ సమస్య ఉందని తేలితే చికిత్స తీసుకోవచ్చు. దీంతో గుండె జబ్బులు లేదా హార్ట్ ఎటాక్‌లు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. ఇలా జాగ్రత్త పడితే ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి సమస్యలు రావు.