తెలివైన వారిలా కనిపించాలంటే ఇతరులతో మాట్లాడే సమయంలో ఈ 7 పనులు చేయండి,

ఇతరులతో మాట్లాడిన ప్రతి ఒక్కసారి అవతలి వైపు నుంచి మర్యాద ఆశిస్తాం. నిజాయితీగా ఉండటానికి ప్రయత్నిస్తాం. కానీ, ఇది అన్నివేళలా సమంజసం కాదు. కొన్నిసార్లు జాగ్రత్తకు మించి వ్యవహరించాల్సి ఉంటుంది.


వీలైనంత వరకూ ఎదుటివారు ముందు తెలివిగలవారిగా కనిపిస్తేనే ఏ సమస్యా ఉండదు. మీరు కూడా ఏ మాత్రం అవకాశం వదలకుండా ఉండాలంటే, ఈ 7 రూల్స్ తప్పక పాటించండి. ఇక లేటెందుకు అవేంటో చూసేయండి.

1. పదాల ఎంపికపై ఫోకస్

ప్రవర్తనలపై జరిపిన చాలా అధ్యయనాల్లో బయటపడిన వాస్తవమేమిటంటే, అవతలి వ్యక్తితో మాట్లాడే సమయంలో స్మార్ట్ లాంగ్వేజ్ అంటే చక్కటి భాష, అభ్యంతరాలు లేనటువంటి భాషను మాత్రమే ఉపయోగించాలట. ఇలా కాకుండా భారీ పదజాలాన్ని వినియోగించాలని ప్రయత్నిస్తే, అది మీ బలహీనతగా మారే అవకాశం కూడా ఉంది. అలా కాకుండా సాధారణమైనదే అయినా, కాస్త అర్థవంతమైన, వినసొంపైన పదాలను వాడితే సరిపోతుంది.

2. వీలైనంత వరకూ అనుకరణకు దూరం

మాట్లాడే శైలిలో వీలైనంత వరకూ మీ బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నించాలి. కానీ, ఇతరులను అనుకరించేలా, తమకు సహజమైనది కానటువంటి బాడీ లాంగ్వేజ్ లేదా భాషను ప్రయోగించడం వల్ల మీలో కాన్ఫిడెన్స్ దెబ్బతినొచ్చు. వీలైనంత వరకూ మీ మాటల్లో నెగెటివ్ అర్థం ప్రతిధ్వనించకుండా చూసుకోండి.

3. ప్రత్యక్ష అనుభవాలనే పంచుకోండి

చాలా మంది చేసే పొరబాటు ఏంటంటే, ప్రతి విషయాన్ని తమ స్నేహితులకూ, బంధువులకూ ఆపాదించుకుని మాట్లాడుతుంటారు. ఇటువంటి ఉపన్యాసాలు విని విని విసిగిపోయి ఉంటారు. పైగా ఇలా మాట్లాడే వారు పొగడ్తలకు బానిసలనే విషయం మర్చిపోకండి. అందుకే ఎదుటి వారి ముందు తెలివిగా కనిపించాలంటే ప్రత్యక్ష అనుభవాలను మాత్రమే పంచుకోండి.

4. స్పష్టమైన పాయింట్‌తో మాట్లాడండి

మీరు ఎంచుకున్న టాపిక్ మీద స్పష్టంగా ఉండండి. చెప్పాలనుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పగలగాలి. ఇతరులకు అర్థమయ్యేలా చెప్పలేకపోతే, దానిని ఇతరులు అలుసుగా తీసుకుని మీ భావాలను వేరేలా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కొన్ని రీసెర్చ్ లలో తెలిసిందేంటంటే, మన మాట్లాడే విషయాలను బట్టి మన తెలివితేటలను అంచనా వేయొచ్చట.

5. చెప్పండి, రాయకండి

రాసే వాళ్లే మేధావులని, రాస్తూ ఉంటే మేధావులు అనుకుంటారని పొరబాటు పడకండి. ఎదుటివారు చెప్పినదానికి ఊ కొట్టి కాసేపటికే పేపర్ మీద రాసే బదులు చెప్పకుండా వెంటనే మీ భావాలను ఎక్స్‌ప్రెస్ చేయండి. వీలైనంత వరకూ మాటలతో చెప్పడమే బెటర్ రాయడం కంటే.., చాలా సార్లు రాసిన దాని కంటే చెప్పిన దానికే పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. అలాంటి వారినే తెలివిగలవారుగా భావిస్తారు.

6. సంబంధం లేని పదాలు వాడొద్దు

ముందుగా చెప్పుకున్నట్లే భాష విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొందరు వ్యక్తులు తమలో భాషా నైపుణ్యం ప్రదర్శించడానికి భారీ పదాలను వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల ఎదుటివారికి అర్థం కాకపోగా మన మూర్ఖత్వం బయటపడిపోతుంది. అందుకే వీలైనంత సరళమైన భాషను ఉపయోగించండి.

7. మౌనంగా ఉండండి

కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండటం కూడా మేధావి అనే ముద్ర పడేలా చేస్తుంది. పదాలకు పదాలకు మధ్య గ్యాప్ ఇచ్చి మాట్లాడటం వల్ల పొరబాట్లు తక్కువ కలగడంతో పాటు, మాట్లాడాల్సిన విషయంపై క్లారిటీ మారకుండా ఉంటుంది. అలా కాకుండా అనర్గళంగా మాట్లాడేయాలనుకుంటే, కొద్దిసేపు మాట్లాడగానే బ్రేక్ వేయాల్సి వస్తుంది జాగ్రత్త.

ఇలా తెలివిగా వ్యవహరించి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.