ఉదయం లేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? బీపీ వస్తున్నట్లే

www.mannamweb.com


మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల అధిక రక్తపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 30 ఏళ్లు నిండిన వారు కూడా బీపీతో బాధపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

కాగా బీపీ సమస్యను త్వరగా గుర్తిస్తే.. చికిత్స కూడా సులభమవుతుంది. కొన్ని లక్షణాల ఆధారంగా బీపీని త్వరగా గుర్తింవచ్చు. ముఖ్యంగా ఉదయం లేవగానే కనిపించే కొన్ని లక్షణాల ఆధారంగా బీపీని ముందస్తుగానే పసిగట్టవచ్చు ఇంతకీ ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఉదయం నిద్రలేచిన వెంటనే తలతిరగినట్లు అనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. అధిక రక్తపోటుకు సంకేతం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేవగానే కళ్లు తిరిగితే.. వెంటనే బీపీ చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

* ఉదయం నిద్రలేచిన వెంటనే దాహంగా అనిపించినా అది హై బీపీకి సంకేతంగా అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు కారణంగా మీరు నోరు పొడిబారినట్లు అనిపించవచ్చు. ఉదయం నిద్ర లేవగానే దాహం ఎక్కువగా అనిపిస్తే వెంటనే వెళ్లి బీపీ చెక్ చేసుకోవాలి.

* నిద్రలేవగానే చూపు మందగించడం చూస్తే అది హైబీపీకి సంకేతం కావచ్చు. రక్తపోటు తరచుగా ఎక్కువగా ఉంటే, కళ్లు బలహీనంగా మారుతాయి. మసకగా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

* ఉదయం లేవగానే వికారం, వాంతులు వంటి సమస్యలున్నా అది హైబీపీకి సంకేతంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. వెంటనే వైద్యులను సంప్రదించి బీపీ చెక్ చేసుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.