బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులోని ఎన్నో మంచి గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బొప్పాయిలోని విటమిన్-ఎ, బి, సి, ఇ, కెలతో పాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్‌లు ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి.
బీపీ మొదలు, జీర్ణ సంబంధిత సమస్యల వరకు బొప్పాయి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే బొప్పాయిని ఎట్టి పరిస్థితుల్లో కొన్ని రకాల ఆహార పదార్థాలతో కలిపి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* బొప్పాయిని పెరుగును ఎట్టి పరిస్థితుల్లో కలిపి తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయిని తిన్న వెంటనే పెరుగు తీసుకుంటే ప్రమాదం తప్పదని నిపుణులు చెబుతున్నారు. సాధారనంగా బొప్పాయికి వేడి చేసే గుణం ఉంటుంది, పెరుగుకు చలువ చేసే గుణం ఉంటుంది. కాబట్టి ఇలాంటి రెండు విభిన్న లక్షణాలున్న వాటిని వెంట, వెంటనే తీసుకుంటే ఇబ్బంది తప్పదని చెబుతున్నారు.
* బొప్పాయిని తీసుకున్న వెంటనే సట్రస్ జాతికి చెందిన పండ్లను తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్రూట్ సలాడ్‌లో బొప్పాయితో పాటు ఆరంజ్ వంటి నిమ్మజాతి పండ్లు కూడా ఉంటాయి. అయితే ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
* బొప్పాయి తీసుకున్న వెంటనే నిమ్మరసం తాగడం కూడా మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఇది ముమ్మాటికీ విష పూరితం. నిమ్మకాయ, బొప్పాయిని కలిపి తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలో అసమతుల్యత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇది రక్తహీనతకు దారితీసే ప్రమాదం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
* బొప్పాయిని, కివి కలిపి తీసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు తప్పవని నిపుణులు అంటున్నారు. ఈ రెండు కలిపి తీసుకోవడం లేదా ఒకదాని వెంట ఒకటి తిన్నా కడుపులో ఇబ్బంది ఏర్పడుడుతుందని అంటున్నారు.
* బొప్పాయి, టమాటా కాంబినేషన్ కూడా మంచిది కాదని నిపుణులు అంటున్నారు. రెండింటినీ కలిపి తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదని చెబుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.