ట్రాఫిక్ రూల్స్ అందరూ ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవ్వని వారిని ట్రాఫిక్ పోలీసులు ఆపుతారు. మీరు ఎలాంటి తప్పులేకుండా వాహానాన్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరమే లేదని చెప్తుంది న్యాయవ్యవస్థ.
ప్రధానంగా కొన్ని హక్కుల గురించి తెలిస్తే మీరు అస్సలు భయపడరు. ఇంతకీ అవి ఏంటి? ట్రాఫిక్ పోలీసులు ఆపినప్పుడు అవి ఎలా హెల్ప్ అవుతాయో ఇప్పుడు తెలుసుకుందా.
ఐడెంటిటీ (Right to Know The Reason)
మీరు ఆఫీసర్ పేరు, బ్యాడ్జ్ నెంబర్, ఐడీ గురించి అడిగి తెలుసుకోవచ్చు. డిమాండ్ చేస్తూ కాకుండా రిక్వెస్ట్ చేస్తూ అడగవచ్చు. వాళ్లు చెప్పేందుకు అంగీకరించకుంటే వారి డిటైల్స్ తీసుకుని మీరు రిపోర్ట్ చేయవచ్చు.
లంచం (Right To Refuse A Bribe)
మీరు ఫైన్ కాకుండా ఎంతో కొంత ఇవ్వొచ్చు అని లంచం అడిగితే మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. నిజంగా ఫైన్ కట్టాల్సి వస్తే ఈ-చలాన్, కోర్ట్, గవర్నమెంట్ పోర్టల్ ద్వారా డబ్బులు కట్టాలి తప్పా.. లంచం రూపంలో ఇవ్వాల్సిన అవసరం లేదు.
డాక్యుమెంట్స్(Right to Show Digital Documents)
చట్టప్రకారం మీరు మీ డ్రైవింగ్ లైసెన్స్, RC, PUC, ఇన్సూరెన్స్ వంటివి మీరు డాక్యుమెంట్స్ రూపంలోనే చూపించాల్సిన అవసరం లేదు. DigiLockerలో లేదా Parivahan ద్వారా మీరు డాక్యుమెంట్స్ చూపించవచ్చు. ఫిజికల్ కాపీలు అసరం లేదు.
వాహనం సీజ్ చేస్తే (Right Against Unlawful Vehicle)
మీరు చట్టబద్ధంగా అన్ని రూల్స్ ఫాలో అవుతున్నప్పుడు ట్రాఫిక్ పోలీసులు మీ బండి సీజ్ చేయరు. మీ దగ్గర సరైన లైసెన్స్ లేనప్పుడు, బండి రిజిస్ట్రేషన్ లేదా ఇన్సూరెన్స్ అయిపోయినప్పుడు, మీరు డ్రంక్ డ్రైవ్ లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో ఉన్నప్పుడు మాత్రమే ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని సీజ్ చేస్తారు.
బ్రీత్ ఎనలైజర్ టెస్ట్(Right to Refuse Breathalyzer Test)
మీరు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ వద్దు అనుకుంటే నో చెప్పొచ్చు. కానీ దానివల్ల వెంటనే మీ లైసెన్స్ సస్పెన్షన్ చేస్తారు. ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ టెస్ట్ చేయిస్తారు. అలాగే భారీ మొత్తంలో ఫైన్ వేస్తారు. లీగల్‌గా కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
వారికి కాల్ చేయొచ్చు (Right to Call A Lawyer)
మిమ్మల్ని ట్రాఫిక్ పోలీసు ఇబ్బంది పెడుతున్నా.. అనవసరంగా మీపై ఫైన్స్ వేస్తున్నా మీరు లాయర్‌కి లేదా సీనియర్ ఆఫీస్‌కి సహాయం కోసం కాల్ చేయవచ్చు.
రికార్డు చేయొచ్చు (Right to Record the Interaction)
మీరు ట్రాఫిక్ పోలీసుతో మాట్లాడేప్పుడు రికార్డు చేయొచ్చు. ఇది మీకు భద్రత ఇవ్వడంతో పాటు లీగల్ ప్రూఫ్‌గా హెల్ప్ అవుతుంది. అయితే మీరు ట్రాఫిక్ పోలీసు విధులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని గుర్తించాలి.
మీరు అన్నిరూల్స్ ఫాలో అవుతున్నప్పుడు ఈ హక్కులు మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వీటి గురించి అందరికీ అవగాహన ఉండాలి.
































