మీ వయసు ప్రకారం రోజుకు ఎన్ని కేలరీలు తినాలో తెలుసా

ఆరోగ్యంగా ఉండాలంటే ఆహార పదార్థాల్లోని కేలరీలను ఆచి తూచి లెక్కించుకుని తినడం ఒక్కటే సరిపోదు. ఏ వయసు వారు దానికి తగ్గట్టుగా తప్పనిసరిగా రోజూ ఎన్ని క్యాలరీలు తీసుకోవాలో అంతే తీసుకోవాలి. బరువు అదుపులో ఉంచుకోవాలనే తాపత్రయంతో తగిన మోతాదులో తినకుండా రోజూ కడుపు మాడ్చుకున్నారో..


నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు బరువును అదుపులో ఉంచుకోవడం ఎంత అవసరమో.. రోజూ శరీరానికి సరిపడినంత తినటమూ ఎంతో ముఖ్యం. మనం తినే ఆహారంలో ఏ స్థాయిలో కేలరీలు ఉన్నాయని మనం గమనించుకున్నప్పుడే ఈ రెండు అంశాల మధ్య సమతుల్యత ఏర్పడుతుంది. అంతే కానీ, చిన్నపిల్లల్లాగా అరకొరగా తింటూ ఆకలి చంపుకున్నారో లేని పోని అనర్థాలు రావడం ఖాయం. వయసు మారేకొద్దీ ప్రతి ఒక్కరూ రోజూవారీ తీసుకోవాల్సిన కేలరీల మోతాదు మారుతుందనే విషయం తప్పక గుర్తుంచుకోండి. ఈ చార్ట్ ఫాలో అయ్యి ఆరోగ్యకర జీవితాన్ని సొంతం చేసుకోండి.

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తీసుకునే కేలరీలను కేలరీలు తీసుకోవడం, ఖర్చు చేయడంలో సమతుల్యత పాటించడం చాలా ముఖ్యం. మనం ఖర్చు చేసే దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకుంటే అదనపు కొవ్వు నిల్వలు తయారయ్యే ప్రమాదముంది. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. వ్యక్తుల వయస్సు, జెండర్, బరువును బట్టి రోజువారీ కేలరీల అవసరాలు మారుతూ ఉంటాయి. అందువల్ల, డైటీషియన్‌ సలహా ప్రకారం సమతుల్య ఆహారం ద్వారా కావాల్సినంత కేలరీలు మాత్రమే తీసుకోండి.

కేలరీలు అంటే ఏమిటి..

కేలరీలు అంటే ఆహారంలో లభించే శక్తి. మనం తినే ప్రతిదానిలో కేలరీలు ఉంటాయి. ఉదాహరణకు 100 గ్రాముల బియ్యం 156 కేలరీలు,30 గ్రాముల బాదం 169 కేలరీలు, 100 గ్రాముల చీజ్ 282 కేలరీలు కలిగి ఉంటాయి.

రోజువారీ కేలరీల అవసరాలను అంచనా వేయడం :

డేటా విశ్లేషణ ఆధారంగా జీవనశైలిని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు:

నిశ్చల జీవనశైలి : తక్కువ శారీరక శ్రమ కలిగిన వ్యక్తులు అంటే ఎక్కువ సమయం కూర్చుని లేదా పరిమితంగా నడిచేవారు.

మధ్యస్థంగా చురుకైన జీవనశైలి: చురుకైన జీవనశైలి జాబితాలో మితంగా నడవడం, తేలికపాటి శారీరక శ్రమ లేదా ఇంటి పనులు చేసేవారు ఉంటారు.

చురుకైన జీవనశైలి:అత్యంత చురుకైన జీవనశైలి వర్గానికి చెందిన వారు అధిక స్థాయిలో పనులు చేస్తారు. ఇలాంటి వారు క్రమం తప్పకుండా వ్యాయామం, తరచుగా నడవడం వంటి వాటిని తమ దినచర్యలలో తప్పక భాగం చేసుకుంటారు.

పైన చార్ట్‌లో ఇచ్చిన కేలరీల సిఫార్సులు ఆరోగ్యకరమైన బరువు ఉన్న వ్యక్తులకు వర్తిస్తాయి. ఒకవేళ మీరు బరువు పెరగాలంటే సిఫార్సు చేసిన మొత్తం కంటే అదనంగా 500 కేలరీలు తీసుకోండి. బరువు తగ్గాలంటే సూచించిన మొత్తం కంటే 500 కేలరీలు తక్కువగా తినాలని లక్ష్యంగా పెట్టుకోండి. మీ నిర్దిష్ట అవసరాలు, ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా డైటీషియన్‌ను సంప్రదించి వ్యక్తిగత సలహా పొందేందుకు ప్రయత్నిస్తే మరీ మంచిది.